మీ అభిమాన హీరోల హెల్త్ కండీషన్ తెలుసా..?
ఎనర్జిటిక్ హీరో రామ్ తన కెరీర్‌లోనే తొలిసారి ఒక బైలింగ్వల్ మూవీ చేస్తున్నాడు. లింగుసామి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషల్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందీ సినిమా. ఇక ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మరింత ప్రత్యేకంగా కనిపించాలని రామ్ బాడీ బిల్డ్ చేస్తున్నాడు. అయితే ఈ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాసెస్‌లో రామ్ మెడకి గాయం అయ్యింది. దీంతో షూటింగ్‌కి బ్రేకులు పడ్డాయి.
'ట్రిపుల్ ఆర్'లో రామ్ చరణ్ కటౌట్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. చెర్రీ పర్ ఫెక్ట్ గా బాడీ బిల్డ్ చేశాడని అభిమానులు అయితే బోల్దన్ని పోస్టులు పెట్టారు. అయితే ఈ లుక్ తెచ్చుకోవడానికి చరణ్ చాలా కష్టపడ్డాడు. గంటలకొద్ది వర్కవుట్లు కూడా చేశాడు. ఇక ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో చరణ్ మడమకి గాయం అయ్యింది.
జూ.ఎన్టీఆర్ బోల్డన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాడు. కామెడీ, క్లాస్, మాస్, యాక్షన్, అనే తేడాలేకుండా చాలా సినిమాలు చేశాడు. కానీ తారక్ మాత్రం ఏ సినిమాకి బాడీ బిల్డ్ చేయలేదు. 'టెంపర్'లో సిక్స్‌ప్యాక్ చూపించినా బాడీ బిల్డర్‌లా కనిపించలేదు. కానీ 'ట్రిపుల్ ఆర్'లో కొమరం భీమ్ పాత్రం కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫిట్‌నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ట్రైనింగ్‌లో కండరగండుడిగా మారాడు. అయితే ఈ ప్రాసెస్‌లో తారక్ మణికట్టుకి మైనర్ ఇంజూరి అయ్యింది. మొత్తానికి స్టార్ హీరోలు వరుసగా గాయాల బారిన పడుతున్నారు. దీంతో సినీ ఇండస్ట్రీలో కొన్ని సార్లు షూటింగ్ లు ఆగిపోయే పరిస్థితి ఎదురవుతోంది. అభిమానులు కొంత ఆందోళనకు కూడా గురవుతున్నారు.