వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

VAMSI
టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో ఇప్పుడిప్పుడే వెలుగులోకి వచ్చి క్రేజ్ ను పెంచుకుంటున్న కథానాయికలలలో అనన్య నాగళ్ళ పేరు ముందు వరుసలో ఉంటుంది. "మల్లేశం" చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన వకీల్ సాబ్ చిత్రంతో ఒక్కసారిగా ఫుల్ ఫేమస్ అయిపోయింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో ఈమె చేస్తున్న సందడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. మొదటి చిత్రంలో ఎంతో పద్ధతిగా చీరకట్టులో ఒదిగిపోయిన ఈ భామ ఆ తరువాత గ్లామరస్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. తెలంగాణ నుండి ఇండస్ట్రీ వైపు అడుగు వేసిన ఈ అచ్చ తెలుగమ్మాయి ప్రస్తుతం తన పాపులారిటీని పెంచుకునేందుకు బాగా బిజీగా ఉంది. ఫుల్ గ్లామర్ ఫోటో షూట్లలో అందాలను ఆరబోస్తూ యువతను ఉర్రూతలూగిస్తోంది.
తెలుగు సంప్రదాయానికి చీర కట్టినట్టు ఎంతో పద్ధతిగా ఉండే అనన్య ఇలా ఒక్కసారిగా ఫుల్ గ్లామరస్ గా కనిపిస్తుండడంతో మొదట్లో ప్రేక్షకులు షాక్ అయినా, ఆ తర్వాత ఈమె పోస్టులకు అలవాటైపోయారు. ఎంత క్యూట్ గా ఉండే అనన్య కు ఇప్పుడు తాజాగా ఓ యంగ్ హీరో చిత్రంలో హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చినట్లు టాలీవుడ్ ఇన్సైడ్ టాక్. ఈ మధ్య సోషల్  మీడియాలో తన క్రేజీ ఫోటోలతో రచ్చరచ్చ చేస్తూ పెద్ద సెలబ్రిటీగా మారిపోయిన అనన్యకు పిలిచి మరి అవకాశం ఇచ్చారట ఆ డైరెక్టర్.  అయితే ఆ చిత్రంలో అనన్య పాత్ర చాలా మోడ్రన్ గా ఉండబోతుందని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబందించి ఆమె డేట్స్ కూడా ఇచ్చేసారని సమాచారం. అతి త్వరలోనే తన నూతన చిత్రం గురించి అధికారికంగా ప్రకటించనున్నారట అనన్య . ఇంతకీ డైరెక్టర్ ఎవరు, హీరో ఎవరు...నిజంగానే అనన్య ఇపుడు మరో చిత్రంలో హీరోయిన్ గా చేస్తోందా అంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే మరో వైపు మన హాట్ క్యూట్ బ్యూటీ అనన్య నాగళ్ళ మాత్రం సోషల్ మీడియాలో తన తాజా ఫొటో షూట్ లతో అభిమానుల సంఖ్యను అంతకంతకూ పెంచేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి మంచి తరుణం కోసం వెయిట్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: