వెంకీ ని సర్ప్రైజ్ చేసిన బన్నీ..!

MADDIBOINA AJAY KUMAR
ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ ఈరోజు ఎఫ్ 3 సినిమా సెట్స్ లో సందడి చేశారు. అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే... అయితే బన్నీ ఈ రోజు ఎఫ్-2 సినిమా షూటింగ్ సెట్స్ కు వెళ్లి సినిమాలో హీరోగా నటిస్తున్న వెంకటేష్, వరుణ్ తేజ్ లతో పాటు సునీల్, రాజేంద్ర ప్రసాద్, దర్శకుడు అనిల్ రావిపూడి లతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్, సునీల్, రాజేంద్రప్రసాద్ మరికొందరు భారీ తారాగణం తో సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.


ఇక ఎఫ్ -3 షూటింగ్ స్పాట్ లో బన్నీ బ్లాక్ టీ షర్ట్... ట్రౌశర్ ధరించి స్టైలిష్ లుక్ లో కనిపించారు. అంతే కాకుండా అల్లు అర్జున్ ఈ సారి మరో కొత్త హెయిర్ స్టైల్ తో సందడి చేయడం స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. 
ఇక ప్రస్తుతం బన్నీ ఎఫ్ 3 టీంతో కలిసి సందడి చేసిన ఫోటో లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బన్నీ ఎఫ్ -3 సినిమా సెట్స్ లో నటీనటులతో ముచ్చటిస్తున్న ఫోటోలో ప్రతి ఒక్కరి ముఖాలు వెలిగిపోతున్నాయి. ఇది ఇలా ఉంటే ఎఫ్-2 సినిమా విడుదలై మంచి విజయం సాధించగా దర్శకుడు అనిల్ రావిపూడి వెంకటేష్ ,వరుణ్ తేజ్ లు హీరోలుగా ఎఫ్ -3 సినిమాను ప్రారంభించారు.


ఎఫ్ -2 సినిమా భార్యల వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను  కళ్ళకు కట్టినట్లు చూపించగా... ఎఫ్ -3 సినిమాలో డబ్బు వల్ల వచ్చే ఫ్రస్టేషన్ ను చూపించబోతున్నట్టు ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తుంది. అయితే గతంలో ఈ సినిమాలో హీరోయిన్లు మారుతున్నారని వార్తలు రాగా చివరికి హీరోయిన్లుగా కూడా తమన్నా మరియు మెహ్రీన్ లనే అనిల్ రావిపూడి ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమాలో సునీల్ ఒక్కడు మాత్రం అదనంగా జాయిన్ అయ్యాడు... మిగతా నటీనటులు దాదాపు ఎఫ్-2 లో నటించిన వారే కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: