క్రిష్ పొరపాటును ఎత్తి చూపుతున్న విమర్శకులు !
అంతేకాదు వైష్ణవ్ తేజ్ తన సినిమా కెరియర్ కు సంబంధించి ద్వితీయ విఘ్నం అధిగ మిస్తాడా అన్న చర్చలు కూడ జరుగుతున్నాయి. ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ఈమూవీ ట్రైలర్ చూసిన విమర్శకులు కొన్ని కామెంట్స్ చేస్తున్నారు. క్రిష్ దర్శకత్వం వహించిన సినిమాలలో నటీనటులు కంటే ఆ పాత్రలే చాల సహజంగా కనిపిస్తాయి.
క్రిష్ తాను తీసే ప్రతి సినిమాకు సంబంధించి ప్రతి విషయాన్ని చాల నిశితంగా చూస్తాడు అన్న పేరుంది. అలాంటి క్రిష్ ఒక పొరపాటు చేసాడు అంటూ ఇప్పుడు కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రాకుల్ ప్రీత్ ఒక గొర్రెల కాపరి. రకుల్ ను గొర్రెల కాపరుల అమ్మాయిగా ఒదిగిపోయేలా క్రిష్ తమారుచేసాడు. ఇంతవరకు బాగానే ఉన్న రకుల్ చేతికి రెండు పెద్దపెద్ద బంగారపు ఉంగరాలు ఉండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి టీజర్ లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనితో గొర్రెలు కాచే అమ్మాయి చేతికి బంగారు వస్తువులు ఎలా వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. బహుశా ఈమధ్య చాల వ్యక్తిగత సమస్యలలో ఇరుక్కున్న రకుల్ ఎవరైనా జ్యోతిష్కుడు సలహాతో ఇలా చేతికి బంగారపు ఉంగరాలతో కనిపించి ఉంటుంది అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తరువాత క్రిష్ కెరియర్ ఏమాత్రం బాగాలేదు. ఇలాంటి పరిస్థితులలో క్రిష్ ను నిలబెట్టడానికి ఒక హిట్ కావాలి. ఆ ప్రయత్నాలో భాగంగా తీసిన ఈ ‘కొండ పాలెం’ ఎంతవరకు సగటు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందో చూడాలి..