హీరోలకు కీలకంగా మారిన అక్టోబర్ ?

Seetha Sailaja
గత కొంతకాలంగా ఇండస్ట్రీ వర్గాలలో నలుగుతున్న టిక్కెట్ల రేట్స్ విషయంలో అక్టోబర్ 4 తరువాత తేలిపోతుంది అంటూ ఒక ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రేట్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా ఆ నిర్ణయాన్ని పూర్తిగా అమలు చేయకపోవడంతో రీసెంట్ గా విడుదలైన ‘లవ్ స్టోరీ’ మూవీ ప్రదర్శింపబడే ధియేటర్లు కొన్ని ఎక్కువ రేట్లకు అమ్మినట్లు ప్రచారం జరుగుతోంది.

దీనితో టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన ఒక నిర్మాత ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ల రెట్ల విషయంలో తీసుకున్న నిర్ణయం ఇంకా అమలు కావడంలేదు అంటూ కోర్టులో ఒక పిల్ వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పిల్ పై విచారణ అక్టోబర్ 4 తరువాత ఎప్పుడైనా విచారణ జరగవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి.

ఈ పిల్ పై విచారణ జరిగే డప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన వాదన ఎలా వినిపిస్తుంది అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో ఉంది. టిక్కెట్ల రెట్ల విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం తన నిర్ణయం విషయంలో కొద్దిగా మార్పులు చేసుకుంటే ఆ మార్పులు పవన్ కళ్యాణ్ ఘాటైన వ్యాఖ్యలు వల్ల ప్రభుత్వం రాజీ పడింది అన్న సంకేతాలు వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు.

ఇలాంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు ధియేటర్ల యజమానులకు ఇండస్ట్రీ వర్గాలకు నష్టం కలగకుండా తన పట్టు విడవకుండా ఎలాంటి నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతుంది అన్న ఆశక్తి ఇండస్ట్రీ వర్గాలలో రోజు రోజుకి పెరిగిపోతోంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా సినిమా టిక్కెట్ల రెట్ల పెంచే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చేసిన ఘాటైన వ్యాఖ్యలకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖుల నుండి సరైన సంఘీభావం లభించకపోవడంతో పవన్ ఏకాకి అయిపోయాడా అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రాబోతున్న అక్టోబర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి అత్యంత కీలకంగా మారింది అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: