మహేష్ మూవీలో వదిన గా మెగా హీరోయిన్ .... ??

GVK Writings
టాలీవుడ్ నటుడు మహేష్ బాబు లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట షూటింగ్ లో ప్రస్తుతం విరామం లేకుండా షూట్ లో పాల్గొంటున్నారు. చాలారోజులుగా వరుసగా షెడ్యూల్స్ జరుపుకుంటున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతుండగా తదుపరి షెడ్యూల్ ని త్వరలో స్పెయిన్ లో నిర్వహించనుందట యూనిట్. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా పరశురామ్ పెట్ల ఈ సినిమాని భారీ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా తీస్తున్నట్లు టాక్. అయితే ఈ మూవీ తరువాత త్వరలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మహేష్ తన నెక్స్ట్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.


హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ తీయనున్న ఈ సినిమాని సూర్య దేవర రాధాకృష్ణ నిర్మించనుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మది ఫోటోగ్రాఫర్ గా అలానే థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమా వచ్చే నెలలో దసరా రోజున అఫీషియల్ గా లాంచ్ కానున్నట్లు టాక్. ఈ మూవీ పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మంచి యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ కి వదిన పాత్రలో నటించే నటీమణి కోసం ఇటీవల పలువురిని పరిశీలించిన యూనిట్, ఫైనల్ గా సీనియర్ నటి మీనాని ఆ పాత్ర కి గాను నేడు ఫిక్స్ చేసినట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల న్యూస్.
వాస్తవానికి ఆ పాత్రకి గాను మొదట ఒక బాలీవుడ్ నటిని తీసుకుందాం అని యూనిట్ భావించినప్పటికీ ప్రస్తుతం ఆమెకు వరుసగా కాల్షీట్స్ ఖాళీ లేకపోవడంతో ఫైనల్ గా మీనా ని తీసుకున్నట్లు చెప్తున్నారు. సినిమాలో క్యారెక్టర్ కూడా బాగుండడం అలానే సూపర్ స్టార్ మహేష్ మూవీ కావడంతో మీనా కూడా వెంటనే ఒప్పుకున్నారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అఫీషియల్ గా న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: