టాలీవుడ్ ఇంకా మునుగుతుందా...?

Sahithya
తెలుగు సినిమా ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమకు సహాయం చేయాలని సినిమా పెద్దలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు ఎక్కడా కూడా అన్యాయం జరక్కుండా చూడాలని రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లకు సంబంధించి కాస్త సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా విజయ శాతం చాలా తక్కువగా ఉంది. 20% సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి. దీంతో టాలీవుడ్ లో ప్రస్తుతం ఇబ్బందులు క్రమంగా పెరుగుతున్నాయి. చాలామంది దర్శక నిర్మాతలు తెలుగులో సినిమా చేయాలి అంటే భయపడే పరిస్థితి కూడా ఉంది.
ఈ తరుణంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు తెలుగు సినిమా ను మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టనున్నాయి. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల మీద ఎక్కువగా దృష్టి సారించి ఆరు సినిమాలను రాబోయే మూడేళ్లలో విడుదల చేయాలని ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా వాళ్లకు ఎంతో సహకరిస్తుంది ఏంటి అనేది తెలియడం లేదు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఉన్నారని ప్రచారం ఉంది. దీనిపై సినీ పరిశ్రమ స్పందించి పవన్ వ్యాఖ్యలకు తమకు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టంగా చెప్పింది. కానీ పవన్ కళ్యాణ్ కు కొంత మంది టాలీవుడ్ హీరోల నుంచి మద్దతు వచ్చింది. దీనితో పవన్ కళ్యాణ్... ఇప్పుడు ఏ విధంగా అడుగులు వేస్తారు ఏంటనే దానిపై అందరిలో కూడా ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలను ఆంధ్రప్రదేశ్ ను విడుదల చేస్తారా లేదా అనేది స్పష్టత  రావడం లేదు. అసలే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న టాలీవుడ్ నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎటువంటి రాయితీలు వచ్చే అవకాశం కనబడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: