శేఖర్ కమ్ముల మంచి పాయింట్ తీసుకున్నాడు గా!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఫీల్ గుడ్ చిత్రాలు తెరకెక్కించే దర్శకుడుగా శేఖర్ కమ్ములకు మంచి పేరుంది. ఆయన దర్శకత్వం వహించిన ఆనంద్ సినిమా నుంచి ఇప్పటి లవ్ స్టోరీ చిత్రం వరకు కూడా ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సినిమాలే. ముఖ్యంగా క్లాస్ ప్రేక్షకులను ఆయన సినిమాలు ఎంతగానో అలరించాయి. ఈ క్రమంలోనే ఆయన మరో క్లాసికల్ చిత్రాన్ని తెరకెక్కించగా ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్ లలో విడుదల అయ్యింది.

అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాగా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకు పోతుంది ఈ సినిమా. అక్కినేని నాగచైతన్య సాయి పల్లవి నటన హైలెట్ గా నిలిచాయని, శేఖర్ కమ్ముల దర్శకత్వం మరో రేంజ్ లో ఉందని, పవన్ సంగీతం గురించి వేరే చెప్పనవసరం లేదని చెబుతున్నారు ఈ సినిమా చూసినవారు. అయితే ప్రేమకథా చిత్రాల్లో పెద్దగా కథ అనేది ఏమీ ఉండదు. ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకోవడం.. వారికి ఎవరో ఒకరు అడ్డుతగలడం.. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకోవడం.. ఇది ఎక్కువగా ప్రేమ కథ చిత్రాలలో ఉండే కథ. 

అయితే ఈ సినిమాలోనూ అదే పాయింట్ వున్నా కూడా శేఖర్ కమ్ముల తన దర్శకత్వం తో మ్యాజిక్ స్క్రీన్ ప్లే తో ఈ సినిమాను ప్రేక్షకులకు నచ్చే విధంగా చేశాడు. అంతే కాదు కులం అనే పాయింట్ ను ఈ సినిమాలో చూపించి కుల పట్టింపులు విధంగా ఉంటాయా అనే విధంగా చూపించాడు. తెలంగాణ లోని కొన్ని పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించాడు శేఖర్ కమ్ముల. తెలంగాణ యాస ను హీరో హీరోయిన్లతో చెప్పించి తెలంగాణలో ఉన్న పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు తీర్చిదిద్ది ఈ సినిమాలో ఇక్కడి సాంప్రదాయాన్ని చూపించి మరోసారి సూపర్ హిట్ కొట్టాడు. ఇది ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది అని చెప్పొచ్చు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: