సాధారణంగా స్టోర్ట్స్ స్టార్ లకు మరియు సినిమా తారలకు మంచి సంబంధాలు ఉంటాయి. ఎలా కుదురుతుందో తెలియదుగానీ చాలా ఈవెంట్లలో సినిమా తారలతో కలిసి స్పోర్ట్స్ స్టార్స్ కనిపిస్తుంటారు. ఇక హైదరాబాదీ షట్లర్ పీవీ సింధు కూడా సినిమా వాళ్లతో ఎక్కువగా కనిపిస్తుంటారు.ఇటీవలే పీవీ సింధూ రామ్ చరణ్ మరియు అక్కినేని అకిల్ తో కలిసి ఓ ఈవెంట్ కు హాజరు కాగా దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యియి. అయితే తాజాగా పీవీ సింధు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే తో కలిసి బ్యాట్మింటన్ ఆడినట్టు దీపికా పదుకునే సోషల్ మీడియాలో వెల్లడించింది.
అంతే కాకుండా రెండు సార్లు ఒలంపిక్స్ లో దేశానికి పతకాలను తీసుకువచ్చిన పీవీ సింధూతో బ్యాట్మింటన్ ఆడిన ఫోటోలను దీపికా పదకునే తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు దీపికా...ప్రతి రోజూలాగా ఈ రోజు కూడా నా జీవితంలో ఒక సాధారణ దినం. ఈ రోజు పీవీ సింధు తో కలిసి క్యాలరీలను కరిగిస్తున్నా. అంటూ పేర్కొంది. ఇక ఈ ఫోటోలలో దీపికా పదుకునే బ్లాక్ కలర్ టాప్ మరియు బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించి ఉండగా పీవీ సింధు మెరూన్ కలర్ లో ఉన్న స్పోర్ట్స్ బనియన్ మరియు బ్లాక్ కలర్ ట్రాక్ ప్యాంట్ ధరించి కనిపించింది. ఇక ఇద్దరూ కూడా బ్యాట్ లు పట్టుకుని ఆడుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవలే దీపికా పదుకునే మరియు పీవీ సింధు కలిసి దీపికా భర్త రన్వీర్ సింగ్ తో కలిసి డిన్నర్ డేట్ కు వెళ్లారు.
ఇక దీపికా పదుకునే కు మరియు పీవీ సిందు కు మధ్య బంధం బలపడటానికి మరో కారణం కూడా ఉంది. అదేంటంటే దీపికా పదుకునే కూడా నేషనల్ లెవల్ బ్యాట్మింటన్ క్రీడాకారిని గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వకముందు దీపికా బ్యాట్మింటన్ క్రీడాకారిని గా కోర్టులో అదరగొట్టింది కూడా..అంతే కాకుండా దీపికా పదుకునే తండ్రి ప్రకాష్ పదుకునే కూడా ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారుడిగా దేశంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా బాలీవుడ్ భామ దీపికా పదుకునే టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించబోతున్న పాన్ ఇండిమా సినిమాలో హీరోయిన్ నటించనున్నారు.