రాశిఖన్నా గూర్చి షాకింగ్ డెసిషన్ తీసుకున్న నటుడు....!!

murali krishna
రాశీఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అప్పుడప్పుడు తెలుగు, తమిళ్ లోనూ కనిపిస్తుంది.తెలుగులో రాశీఖన్నా మనం సినిమాలో ఓ గెస్ట్ పాత్రతో కనిపించినా హీరోయిన్ గా పరిచయం అయింది మాత్రం ఊహలు గుసగుసలాడే సినిమాతోనే. అవసరాల శ్రీనివాస్ డైరెక్టర్ గా మొదటి సినిమా ఇదే. ఈ సినిమాతోనే రాశీఖన్నాని హీరోయిన్ గా తెలుగు పరిశ్రమకి పరిచయం చేసాడు.ఇక హీరోయిన్ రాశీ ఖన్నా.. తెలుగు, తమిళంలో వరుస సినిమాలు చేసింది. ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేకపోవడంతో.. ఆమె బాలీవుడ్ ప్లైట్ ఎక్కేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తుంది. అప్పుడప్పుడు తెలుగు, తమిళ్ లోనూ కనిపిస్తుంది.రాశీఖన్నాకు అవసరాల శ్రీనివాస్ కు మధ్య మంచి స్నేహం ఉంది. ఊహలు గుసగుసలాడే తర్వాత పలు సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు. వీరి స్నేహ బంధం అప్పటి నుంచీ కొనసాగుతూనే ఉంది. తాజాగా అవసరాల శ్రీనివాస్ ఓ సందర్భంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో రాశీఖన్నా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.రాశి ఖన్నా కారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నేనా కారులో కూర్చోను, ఎందుకంటే ఆమె డ్రైవింగ్ అంటే తనకి చాలా భయం అని చెప్పుకొచ్చారు. రాశి ఖన్నా స్టంట్ మాస్టర్ కంటే దారుణంగా డ్రైవింగ్ చేస్తుంది, ఆమె డ్రైవ్ చేస్తున్న కారు ఒకే ఒక్కసారి ఎక్కాను మళ్ళీ నా వల్ల కాదు అని ఇంకా ఎప్పుడు ఎక్కలేదు. ఆ రోజే రాశి ఖన్నా కారు కనుక డ్రైవ్ చేస్తే తాను ఎక్కకూడదు అనే నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.ఇక ఆమె డ్రైవింగ్ అనుభవం అవసరాల శ్రీనివాస్ ఓ మెమరీలా గుర్తుండిపోయింది అని అర్ధం అవుతోంది. నిజానికి హీరోలలో ఎన్టీఆర్ డ్రైవింగ్ కూడా అంతే ర్యాష్ గా ఉంటుందని ఆయన కారు ఎక్కిన వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇప్పుడు రాశి ఖన్నా గురించి అవసరాల శ్రీనివాస్ అదే విధమైన కామెంట్లు చేయడం గమనార్హం. అయితే ఈ విషయం మీద రాశి ఖన్నా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: