దాని కోసం మహేష్ ఫ్యాన్స్ వెయిటింగ్ ... ??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు తో పరశురాం తీస్తున్న సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా 14 రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటెర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలపై ఎంతో భారీ ఖర్చుతో రూపొందుతున్న ఈ మూవీలో అలవైకుంఠపురములో నటుడు సముద్రఖని విలన్ గా నటిస్తుండగా ప్రస్తుతం ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. తదుపరి షెడ్యూల్ ని త్వరలో యూరోప్ లో నిర్వహించనున్నట్లు టాక్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు ఒక కీలక పాత్ర చేస్తున్నట్లు సమాచారం.
బ్యాంకింగ్ రంగాన్ని ఇటీవల ఎంతో కుదిపేసిన పలు ఆర్ధిక నేరాలని ఆధారంగా చేసుకుని సాగే మంచి మెసేజ్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు టాక్. ఇక ఈ మూవీలో సూపర్ స్టార్ మహేష్ పాత్ర అదిరిపోతుందని, తప్పకుండా వచ్చే ఏడాది జనవరికి విడుదల కానున్న ఈ మూవీ భారీ సక్సెస్ కొట్టడం ఖాయం అని యూనిట్ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే మ్యాటర్ ఏమిటంటే ఈ సినిమా నుండి త్వరలో ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానుంది అంటూ కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సాంగ్ ఈ ఈ నెలలో రిలీజ్ చేస్తారేమో అని మహేష్ ఫ్యాన్ ఎంతో ఆశగా ఎదురు చూస్తుండగా ఈ ఫస్ట్ సాంగ్ ని వచ్చే నెలలో దసరా సందర్భంగా విడుదల చేయనున్నారని ఇన్నర్ వర్గాల టాక్. కాగా ఈ మూవీ పై ప్రేక్షకాభిమానులు అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలున్న విషయం తెలిసిందే. మరి పరశురామ్ తో మహేష్ చేస్తున్న ఈ మూవీ ఎంత మేర సక్సెస్ కొడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: