టాలీవుడ్ అందాల తార సమంత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏమాయ చేసావే సినిమా షూటింగ్ సమయంలో ఒకరి మాయలో మరొకరు పడటంతో ఇద్దరూ తమ పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా బందువులు స్నేహితుల నడుమ గోవాలో జరిగింది. అయితే ఇండస్ట్రీలో డేటింగ్ చేసి విడిపోవడం సర్వసాధారణం. కానీ డేటింగ్ తరవాత కూడా తాము ఒకరిని విడిచి మరొకరు ఉండలేరని నిశ్చయించుకున్న తరవాతే సమంత చైతూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట టాలీవుడ్ లోనే చూడచక్కని జంటగా ఎంతో మంది ఆశీర్వాదాలను పొందింది. అంతే కాకుండా సమంత పెళ్లి తరవాత సినిమాలకు గుడ్ బై చెబుతుందని అనుకున్నప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.
మరోవైపు చైతూతో కూడా సమంత సినిమాలలో నటించి అలరించింది. ఇక చూస్తేనే కుల్లుకునేలా ఉండే ఈ చక్కనైన జంట త్వరలో విడిపోతుందంటూ మీడియాలో గత కొద్దిరోజులుగా వార్తలు షికార్లు కొడుతున్నాయి. ఇక ఈ వార్తలకు బలం చేకూరేలా సమంత చెన్నై లో ఉండటం సోషల్ మీడియాలో బ్రోకెన్ పోస్టులు పెట్టడం కూడా కనిపిస్తునే ఉంది. ఇద్దరూ విడాకుల కోసం అప్లై చేసుకున్నారని..ఇప్పటికే కౌన్సిలింగ్ కూడా పూర్తయ్యిందని కానీ కౌన్సిలింగ్ తరవాత కూడా సమంత నాగచైతన్య వెనక్కి తగ్గలేదని పలురకాల వార్తలు వచ్చాయి.
మరోవైపు నాగార్జున కూడా ఇద్దరికీ చెప్పి చూశారని సమంత కుటుంబ సభ్యులు కూడా ఇద్దరినీ ఒప్పించే ప్రయత్నం చేశారని కానీ ఎంత చెప్పినా ఇద్దరూ వినట్లేదని వార్తలు వస్తున్నాయి. ఇక ఆ వార్తలను ఈ జంట కనీసం పట్టించుకోకపోవడంతో ఆ వార్తలన్నీ నిజమేనని అభిమానులు ప్రేక్షకులు అనుకుంటున్నారు. అయితే తాజాగా సమంత నాగచైతన్య విడాకుల విషయంలో మరో వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం సమంత ప్రెగ్నెంట్ అని అందుకే సినిమాలకు కొద్ది రోజులు దూరంగా ఉండాలని నిర్ణయం తీసకుందని కూడా టాక్ వినిపిస్తోంది. మరి ఏది నిజమో ఆ జంట నోరు విప్పితేనే తెలుస్తుంది.