సమంత గురించి అస్సలు అడగొద్దు అంటున్న నాగచైతన్య...!

murali krishna
సమంత గురించి ఎట్టిపరిస్థితుల్లో ఎవరు అడగొద్దు' ఇది నాగ చైతన్య ప్రతి ఇంటర్వ్యూ లలో చెబుతున్న మాట ఇదేనట.
అక్కినేని సమంతతో చైతు నిజంగానే విడిపోతున్నాడా..? ఈ వార్తలో ఎంత నిజం ఉందో అస్సలు తెలియడం లేదు.ఈ ప్రశ్న మీడియా అడుగుతుందేమో అని, బయటకు రావడానికి కూడా చైతు - సామ్ బాగా ఇబ్బంది పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా తెలుగు నెటిజన్లకు అలాగే టాలీవుడ్ మీడియాకీ బాగా దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది.
కానీ అక్కినేని నాగచైతన్య మరియు క్రేజీ బ్యూటీ అయిన సాయి పల్లవిల 'లవ్ స్టోరీ' సినిమా విడుదలకి రెడీ అయిందని సమాచారం. నాగ చైతన్య కి ఇష్టం లేకపోయినా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనాల్సి వచ్చిందని తెలుస్తుంది. దాంతో ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వస్తోందని సమాచారం. ప్రస్తుతం చైతన్య - సమంత విడాకుల గురించే సోషల్ మీడియాలో టాక్ నడుస్తోందని తెలుస్తుంది.కాబట్టి నాగ చైతన్య కనిపిస్తే కచ్చితంగా మీడియా ఈ ప్రశ్న అడుగుతుందని సమాచారం.
అందుకే, ఈ ప్రశ్న అడగకూడదు అని ముందే చైతు పీఆర్వోల టీం మీడియా వ్యక్తులకు మెసేజ్ లు పాస్ చేస్తున్నారని సమాచారం. ఎలాగూ ఇప్పటికే ఈ వార్త పై కొంత క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది.అయినా చైతు మాత్రం ఈ వార్త గురించి అధికారికంగా ప్రకటించడానికి ఇష్టపడట్లేదని సమాచారం. అందుకే సమంత గురించి తనను ఏమి అడగొద్దు అంటూ కండిషన్ పెడుతున్నాడని తెలుస్తుంది.
నాగ చైతన్య రేపు మరియు ఎల్లుండి కొన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్ కు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని సమాచారం. ఈ ఇంటర్వ్యూలలో కొన్ని లైవ్ ఉన్నాయని తెలుస్తుంది.పొరపాటున విడాకులకు సంబంధించిన ప్రశ్న వచ్చినట్లయితే తానూ ఇబ్బంది పడాల్సి వస్తోంది అని నాగచైతన్య ముందుగానే ప్లాన్డ్ గా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని సమాచారం. ఇక 'లవ్ స్టోరీ' ఈ నెల 24న విడుదల కానుందని తెలుస్తుంది.
అన్నట్టు సమంత కూడా ఈ ప్రశ్న నుంచి తప్పించుకోవడానికి టాలీవుడ్ మీడియాకీ బాగా దూరంగా ఉంటుందని సమాచారం. అందుకే సైలెంట్ గా బాలీవుడ్ లో ఎంట్రీకి ఇచ్చి అక్కడే కొన్నాళ్ళు ఉండిపోవాలని నిర్ణయించుకుందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: