అలా చేద్దాం.. డైరెక్టుగా షోలో అడిగేసిన సరయు.. నాగ్ షాక్?

praveen
ప్రస్తుతం బుల్లితెరపై బిగ్బాస్ సందడి మొదలైంది. మొన్నటివరకు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ సందడి చేయగా.. ఇక ఇప్పుడు వారాంతంలో నాగార్జున వచ్చి తనదైన యాంకరింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.  మొదటివారం కావడంతో అటు కంటెస్టెంట్ కి ఎక్కడ వార్నింగులు లాంటివి లేవు అని చెప్పాలి. ఇక అందరితో ఎంతో సరదా సరదాగా మాట్లాడుకుంటూ బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు  నాగార్జున. ఇకపోతే ఈ రోజు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లబోయే మొదటి కంటెస్టెంట్ ఎవరు అనే విషయాన్ని నాగార్జున చెప్పబోతున్నాడు.

 బిగ్బాస్ హౌస్ విషయానికి వస్తే ఇక ఈ సీజన్లో చాలా మంది బుల్లితెర ప్రేక్షకులకు తెలిసిన కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. ఇలా తెలిసిన వాళ్లలో అటు సరయు కూడా ఒకరు. 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సరయు సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. బూతులతో కూడిన షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించి.. సోషల్ మీడియాలో ఎవరూ ఊహించనంత క్రేజ్ సంపాదించింది. అయితే ఇటీవలే బిగ్ బాస్ హౌస్ లోకి రావడంతో..ఇక బిగ్ బాస్ హౌస్ లో కూడా బూతుపురాణం ఓపెన్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు సరయు ఎక్కడ భూతులను మాట్లాడలేదు అని చెప్పాలి.

 అయితే ఇటీవలే ఈ శనివారం ఎపిసోడ్ లో భాగంగా నాగార్జున బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడడానికి రాగా.. ఏకంగా సరయు అందరి ముందే నాగార్జునను ఊహించని కోరిక కోరింది. దీంతో ఏకంగా నాగార్జున సైతం షాక్ అయ్యాడు అని చెప్పాలి. మీరు నన్ను డేట్ కి తీసుకెళ్తారా అంటూ ఏకంగా నాగార్జునను అడిగింది సరయు. నిన్ను నేను డేట్ కి తీసుకెళ్లాలి అంటే ముందు నువ్వు బయటకి రావాలి కదా అంటూ ప్రశ్నిస్తాడు నాగార్జున  ఇప్పుడు కాదు సార్ 100 రోజుల తర్వాత డేట్ కి తీసుకెళ్తారా అంటూ సరయు చెబుతుంది. అయితే తప్పకుండా డేట్ కి తీసుకు వెళతాను అంటూ నాగార్జున చెబుతాడు. దీంతో ఆనందపడుతుంది. ఇలా పబ్లిక్ గా అందరూ చూస్తుండగానే నాగార్జున ను సరయు డేట్ కి తీసుకెళ్తారా అని అడగడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: