నాని హీరోగా నటించిన నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా మారి తొలి విజయాన్ని అందుకున్నాడు శివ నిర్వాణ. ఆ సినిమా ఇచ్చిన విజయోత్సాహంలో ఆయన నాగచైతన్య తో మజిలీ అనే రెండవ సినిమా చేయగా అది కూడా సూపర్ హిట్ కావడంతో ద్వితీయ విజ్ఞాన్ని ఈజీగా దాటేశాడు. అయితే మూడవ ప్రయత్నంగా నాని తో చేసిన టక్ జగదీష్ మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోతుంది. నాని హీరోగా రీతువర్మ, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లుగా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం టక్ జగదీష్.
జగపతి బాబు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించలేదు. పాత చింతకాయ పచ్చడిలా ఈ సినిమా కథ ఉందని నాని ఏ విధంగా ఈ సినిమాను ఒప్పుకున్నాడని ఆయనపై భారీగానే ట్రోల్స్ మొదలయ్యాయి. ముఖ్యంగా శివ నిర్వాణ పై ప్రేక్షకులు దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. పిలిచి అవకాశం ఇస్తే ఈ విధమైన సినిమా చేసి నానికి భారీ ఫ్లాప్ అందిస్తాడా అని ఆయనను సోషల్ మీడియాలో బాగానే త్రొల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అభిమానులు ఈ దర్శకుడి తో సినిమా అంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
టక్ జగదీష్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తోనే శివ నిర్వాణ సినిమా చేయాలి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా క్యాన్సిల్ అయ్యిందని వార్తలు రాగా ఇటీవలే ఈ సినిమా ఉంది అని శివ నిర్వాణ చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఎలా డీల్ చేస్తాడో అని విజయ్ అభిమానులు భయపడుతున్నారు. వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు ఓ ఫ్లాప్ దర్శకుడి నమ్మి ఎలా సినిమా చేస్తాడు అని వారు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. సక్సెస్ ట్రాక్ లో ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ నమ్మి శివ నిర్వాణ కు ఛాన్స్ ఇవ్వగా ఇప్పుడు టక్ జగదీశ్ సినిమా చూసిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.