అందాల విందుతో ఆ వెబ్ సిరీస్ లో ఛాన్స్ కొట్టేసిన విష్ణుప్రియ...?
ఈ నేపథ్యంలో విష్ణుప్రియకు అన్నపూర్ణ స్టూడియోస్, ఆహా ఒరిజనల్ సంయుక్తగా చేపడుతున్న ఈ ప్రాజెక్టులో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందని సమాచారం.
త్వరలో 'ఆహా' ఓటీటీలో ప్రసారం కానున్న 'ద బేకర్ అండ్ బ్యూటీ' వెబ్‌సీరిస్ ద్వారా విష్ణుప్రియ ప్రేక్షకుల ముందుకు రానుందని తెలుస్తుంది. ప్రస్తుతం యాంకరింగ్‌కు దూరంగా ఉన్న విష్ణుప్రియ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుందని సమాచారం.
ఇజ్రాయెల్‌లో మంచి ప్రేక్షకాధరణ పొందిన 'ది బేకర్ అండ్ ది బ్యూటీ' వెబ్ సీరిస్నే తెలుగులో సుప్రియా యార్లగడ్డ రీమేక్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇందులో 'పేపర్ బోయ్', 'ఏక్ మినీ కథ' ఫేమ్ వంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ అలాగే టీనా శిల్పారాజ్, విష్ణు ప్రియా, వెంకట్,ఝాన్సీ, శ్రీకాంత్ అయ్యంగార్, స్వేతా మరియు సంగీత్ శోభన్ తదితరులు నటిస్తున్నారని సమాచారం.
ఈ వెబ్‌సీరిస్‌లో విష్ణు ప్రియకు కొన్ని ముద్దు సీన్లు కూడా ఉంటాయని వార్త వినిపిస్తుంది. మంగళవారం ఈ వెబ్‌సీరిస్ పోస్టర్ విడుదల సందర్భంగా ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపినట్లు సమాచారం.
సెప్టెంబరు 10 వినాయక చవితి సందర్భంగా ఈ వెబ్‌సీరిస్ విడుదల కానున్నట్లు వార్త వినిపిస్తుంది.మొత్తం 10 ఎపిసోడ్లు ఈ వెబ్‌సీరిస్‌లో ఉంటాయని సమాచారం. 'ఆహా'లో ఇదే అతి పెద్ద వెబ్‌సీరిస్ అని నిర్మాత అల్లు అరవింద్ తెలిపినట్లు తెలుస్తుంది.
అయితే, విష్ణుప్రియ ఇటీవల కృష్ణాష్టమి సందర్భంగా మరోసారి అందాల విందు చేసి అందరిని అలరించిందట . బోల్డ్ డ్రెస్‌లో డ్యాన్స్ చేస్తూ కుర్రకారు మతి పోగొడుతుంది.ఈ సందర్భంగా ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయని సమాచారం. ఆ వెబ్ సిరీస్ తో విష్ణుప్రియ మరిన్ని అవకాశాలు అందుకుంటుందో లేదో చుడాలి.