మెగా ఫెస్టివల్స్.. పండగలను బుక్ చేసుకున్న హీరోలు!!

P.Nishanth Kumar
జనవరిలో సినిమాల జాతర ఉంది. దానికి ముందు క్రిస్మస్ సందర్భంగా కూడా కొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. అలాగే దసరా దీపావళి పండుగల సందర్భంగా కూడా కొన్ని సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే ఇక్కడ విశేషమేమిటంటే ఈ పండుగల సందర్భంగా విడుదలయ్యే సినిమాలలో  ఖచ్చితంగా ఒక మెగా హీరో సినిమా ఉంది. ఆ విధంగా ప్రతి సినిమాకి మెగా అభిమానులకు రెండో పండగ లాంటి వాతావరణం థియేటర్ లో నెలకొంటుంది. ఒకే నెలలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన మూడు సినిమాలు కూడా రాబోతున్నాయి.

మెగా అభిమాని ఇంతకంటే ఏం కోరుకుంటాడు. సంక్రాంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గా ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాడు. సాగర్ చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ రచయితగా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్లు వారికి ఎంతగానో నచ్చాయి దాంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని భావిస్తున్నారు మెగా అభిమానులు. ఇక దానికంటే ముందే చిరంజీవి రామ్ చరణ్ అల్లు అర్జున్ వరుణ్ తేజ్ లు తమ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రాబోతున్నారు.

అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న పుష్ప పార్ట్ వన్ సినిమా క్రిస్మస్ కు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్ల అధికారికంగా ప్రకటించారు. చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య కూడా ఆ సమయానికి రావడం అభిమానులకు డబుల్ ధమాకా అనిపిస్తుంది. నిజానికి ఆచార్య సినిమా దసరా కానుకగా లేదా దీపావళి కానుకగా రావాలని భావించగా ఆ సమయానికి చిత్రం రెడీగా ఉండకపోవడంతో క్రిస్మస్ కు విడుదల చేయాలని చిరంజీవి భావిస్తున్నారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా బాక్సర్ గా చేస్తున్న చిత్రం దీపావళి సమయంలోనే రాబోతుంది. కాబట్టి ఒకే నెలలో ఒకే వారంలో నలుగురు మెగా హీరోలు అభిమానులకు  వెండితెరపై కనిపించి కనువిందు చేయడం మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మరి ఈ సినిమాలు విడుదలైన తర్వాత ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాయో చూడాలి. వీటితో పాటే మరిన్ని ఇతర హీరోలకు సంబంధించిన భారీ ప్రాజెక్టులు కూడా విడుదల కాబోతు ఉండడం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: