డీప్ గా చేస్తున్నారు.. చెమటలు పట్టేస్తున్నాయ్..!
రష్మిక మందన్న ఆ కామెంట్స్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ నుంచి ముంబయి వరకు రకరకాల విమర్శలు వినిపిస్తున్నా, రష్మిక మాత్రం చాలా డేరింగ్‌గా ముందుకెళ్తోంది. ట్రోలింగ్‌కి భయపడి ఫ్రెండ్‌షిప్‌ని వదులుకోలేనని మెసేజ్ ఇస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిలేషన్ గురించి సోషల్ మీడియాలో బోల్డన్ని చర్చలు జరుగుతుంటాయి. ఇద్దరూ లవ్‌లో ఉన్నారని కొంతమంది, పెళ్లి చేసుకుంటారని మరికొంతమంది కామెంట్లు పెడుతుంటారు. ఇక ముంబయిలో ఇద్దరూ రెస్టారెంట్‌కి వెళ్లాక ఈ కామెంట్స్ మరింత ఎక్కువయ్యాయి.
రష్మిక మందన్న రీసెంట్‌గా ఒక ఫోటో షేర్ చేసింది. విజయ్ దేవరకొండతో కలిసి వర్కవుట్స్ చేస్తోన్న ఫోటో షేర్ చేసింది రష్మిక. ఇక రష్మిక ఈ ఫోటో షేర్ చేసిందో లేదో ఈమె చాలా డేరింగ్ అని, ర్యూమర్స్‌ని పట్టించుకోకుండా విజయ్‌తో వర్కవుట్ చేస్తోన్న ఫోటో అప్‌లోడ్ చేసిందని కామెంట్లు పెడుతున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పారు గానీ, రిలేషన్‌షిప్ గురించి ఏం మాట్లాడలేదు. ఈ ఫ్రెండ్‌షిప్‌తోనే కలిసి వర్కవుట్స్ చేస్తున్నారు. రెస్టారెంట్స్‌కి వెళ్తున్నారు. ఇక విజయ్ ప్రస్తుతం 'లైగర్'తో బిజీగా ఉంటే, రష్మిక మందన్న 'పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమాలతో పాటు హిందీలో రెండు సినిమాలు చేస్తోంది.