కొరటాల కోసం ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

VAMSI
ఎన్టీఆర్ , కొరటాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నూతన ప్రాజెక్ట్ గురించి మరో తాజా వార్త అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ తో పాటు హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా కీలకమని తెలుస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన కియార అద్వానీ హీరోయిన్ గా చేస్తున్నట్లు వార్తలు వింపిస్తుండగా ఇపుడు కియారా స్నేహితురాలిగా అందాల తార, స్టార్ హీరోయిన్ ఇలియానా కనిపించబోతుంది అంటూ ప్రచారం మొదలయ్యింది. ఒకప్పుడు టాలీవుడ్ లో రాకెట్ లా దూసుకుపోయిన ఇలియానాకి ఇపుడు తెలుగులో అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. అయితే ఇపుడు ఈ ఛాన్స్ తో మళ్ళీ తన హవా తిరిగి కొనసాగించాలని యోచిస్తోందట ఇలియానా.
హీరోయిన్ క్యారెక్టర్ కి ఏమాత్రం తగ్గని పాత్ర కావడం, అందులోనూ సినిమాకి ఈ పాత్ర కీలకం అని చెప్పడంతో వెంటనే ఓకే  చెప్పారట ఇలియానా. అయితే సైజ్ జీరో నడుముతో యువతను ఉర్రూతలూగించిన ఇలియానా కొరటాల, ఎన్టీఆర్ సినిమాలో కనిపిస్తుందా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. గతంలో రాఖీ, శక్తి వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ సరసన నటించింది ఇలియానా, అయితే ఆ రెండు సినిమాలు ఊహించిన ఫలితాలను అందించలేకపోయాయి. కాగా ఈసారి కొరటాల వంటి డైరెక్షన్ లో తారక్ తో కలిసి నటిస్తే హ్యాట్రిక్ మూవీ బ్లాక్ బస్టర్ ను అందుకోవడం ఖాయం అంటున్నారు ఆమె అభిమానులు. ఆర్ ఆర్ ఆర్ వంటి భారీ పాన్ ఇండియా మూవీ తర్వాత యంగ్ టైగర్‌ ఎన్టీఆర్ చేయబోతున్న నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందులోనూ అది సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ లో కావడంతో మరింత ఆసక్తి కనబరుస్తున్నారు అభిమానులు.

జనతా గ్యారేజ్ వంటి భారీ సక్సెస్ తర్వాత కొరటాల మరియు తారక్  హిట్ కాంబో మరోసారి తెరకెక్కతున్న హిట్ కాంబో కావడంతో విశేషం. ఇలా అన్ని వైపుల నుండి భారీ హైప్ ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షమే అంటున్నారు. అయితే ఇది తెల్సిన ఎన్టీఆర్ అభిమానులు ఇలియానా ను తీసుకుంటే సినిమా హిట్ అవుతుందా అనే సందేహాలను వెలిబుస్తున్నారు. మరి ఇలియానా ఈ సినిమాకు ప్లస్ అవుతుందా. కొరటాల మాట విని ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నారా ? చూడాలి. మరి ఓ రేంజ్ లో ఫాలోయింగ్ పెంచుకుంటున్న ఈ మూవీలో ఇలియానా కనిపిస్తుందో లేదో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: