సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు గా టాలీవుడ్ సినిమాల లోకి ప్రవేశించాడు సుధీర్ బాబు. అనతికాలంలోనే నటుడిగా పేరు తెచ్చుకుని తనదైన ముద్ర వేసుకుని హీరోగా ప్రేక్షకుల్లో మంచి అభిమానన్ని సంపాదించుకున్నాడు. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తరువాత ప్రేమకథాచిత్రం, సమ్మోహనం వంటి సినిమాలతో టాలీవుడ్ హిట్స్ అందుకొని హీరోగా నిలదొక్కుకున్నాడు. అయితే ఆ తర్వాత ఆ స్థాయిలో విజయాలు ఈయన ఖాతాలో చేరలేదు.
వరుస ప్లాపులు ఆయనలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతినేలా చేయడం తో బాలీవుడ్లో ఓ ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం కూడా విఫలం కావడంతో తెలుగులో హీరోగా సెటిల్ అవ్వాలని చెప్పి వినూత్నమైన సినిమాలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఇప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ అనే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పలాస సినిమాను తెరకెక్కించిన కరుణ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ కాగా రొమాంటిక్ యాక్షన్ డ్రామా లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో సుధీర్ బాబు నటించాడు.
అయితే ఈ విషయం లో చెప్పుకోదగ్గ అంశం ఏమిటంటే ఆగస్టు 27వ తేదీ విడుదల అవుతుండటం. ఇది గొప్ప విశేషం అని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజున సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన కౌబాయ్ మూవీ మోసగాళ్లకు మొసగాడు విడుదలై అఖండ విజయం సాధించింది. అలాంటి మెమొరబుల్ డే కి సుధీర్ బాబు నటించిన శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం విడుదల కాబోతుంది. ఈ తేదీ మామకు కలిసి రాగా అల్లుడికి కలసి వచ్చి ఆయనకు భారీ విజయాన్ని ఖాతాలో చేర్చుతుందా అనేది చూడాలి. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేక్షకులలో మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అప్డేట్ లు సినిమా పై భారీ అంచనాలు నెలకొనేలా చేస్తున్నాయి.. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో..