చిరంజీవికి మెగాస్టార్ బిరుదు.. ఇచ్చింది ఎవరో తెలుసా?
కేవలం మెగాస్టార్ మాత్రమే కాదు ఇక ఆయన కుటుంబం నుంచి ఎంతోమంది యువ హీరోలు కూడా టాలీవుడ్ లో ప్రస్తుతం రాణిస్తున్నారు అయితే చిరంజీవికి అసలు మెగాస్టార్ అన్న బిరుదు ఎక్కడ వచ్చింది అనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలోకి సహ నటుడు గా ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎన్టీఆర్ కృష్ణ లాంటి వారు సూపర్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఆ సమయంలోనే తన స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగారు మెగాస్టార్ చిరంజీవి. ఇక మెగాస్టార్ సినీ కెరియర్ లో అభిలాష అనే సినిమా ఎంతో కీలకమైనది. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఇక కోదండరామి రెడ్డి చిరంజీవితో ఛాలెంజ్, రాక్షసుడు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇక ఆ తర్వాత చిరంజీవి హీరోగా తెరకెక్కిన మరణ మృదంగం సినిమా కూడా బంపర్ విక్టరీ కొట్టింది. అయితే అప్పటి వరకూ చిరంజీవికి సుప్రీం హీరో అనే బిరుదు ఉండేది. కానీ మరణ మృదంగం సినిమా సూపర్ డూపర్ హిట్ తర్వాత చిరంజీవి పేరు మెగాస్టార్ గా మారిపోయింది సినిమా ప్రారంభం సమయంలో చిరంజీవి పేరు మెగాస్టార్ అని రావడంతో థియేటర్ అంత అభిమానులు ఈలలు గోలలతో హోరెత్తి పోయారట ఇలా ఇక మరణ మృదంగం సినిమా సమయంలో నిర్మాత కె.ఎస్.రామారావు చిరంజీవికి మెగాస్టార్ అన్న బిరుదు ఇచ్చారు. తర్వాత అభిమానులు కూడా చిరంజీవిని అలాగే పిలవడం ప్రారంభించారు ఇక ఇప్పుడు మెగాస్టార్ అన్నది ఒక బ్రాండ్ గా.. ఒక స్పూర్తిగా, ఒక బరోసా గా మారిపోయింది అని చెప్పాలి.