'నారప్ప'ను పెద్ద సినిమాలు ఆదర్శంగా తీసుకుంటాయా ?
అయితే ఇదే ఆంశంపై టాలీవుడ్ లో కొందరు నిర్మాతలు మరియు హీరోల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలకు ఇప్పటికే విడుదలకు చాలా లేట్ అయింది. తద్వారా పలు రకాల కారణాల వల్ల ఆ ఎఫెక్ట్ సినిమా వసూళ్లపై పడే అవకాశం ఉంది. దాంతో చాలా మంది నిర్మాతలు ఈ కరోనా సమయంలో డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ల ప్రభావంతో భయపడుతున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. కాస్త లేట్ అయిన సినిమాలు థియేటర్లలోనే నేరుగా విడుదల చేయాలంటూ యంగ్ హీరోల నుండి సీనియర్ హీరోల వరకు ఓకే మాట చెబుతున్నారట.
అయితే ఈ విషయంలోనే అటు నిర్మాతలకు ఇటు హీరోలకు పొంతన కుదరకపోవడంతో వీరి మధ్య మనస్పర్ధలు వస్తున్నాయని వార్తలు వినపడుతున్నాయి. ఈ క్రమంలో ఓ టి టి వైపు ఏ సినిమాలు అడుగులు వేస్తాయో ? ఏ సినిమాలు వెండితెరపై కనబడతాయో తెలియాల్సి ఉండగా, ఏ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చాటుతాయో చూడాలి. ఇప్పటికే నారప్ప లాంటి భారీ బడ్జెట్ చిత్రం ఓ టి టి లో విడుదలయి థియేటర్లకు ధీటుగా వసూళ్లను సాధించి, ఓ టి టిలో విడుదల చేసినా లాభాలు పొందవచ్చని నిర్మాత సురేష్ బాబు రుజువు చేశారు.