మన హీరోలను చూసి ఎన్నాళ్ళయింది!!

P.Nishanth Kumar
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దాదాపు డజను మంది హీరోలు స్టార్ హీరోలుగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఇక న్యూట్రల్ గా ఉండే అభిమానుల సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ విధంగా వారు తెలుగునాట భారీ మార్కెట్ ను ఏర్పరుచుకున్నారు. ఒక్కో సినిమాకి కోట్లల్లో పారితోషికం అందుకుంటు నిర్మాతలకు కాసుల పంట పండిస్తున్నారు. ఇక ఈ మధ్య పాన్ ఇండియా వైడ్ గా కొంతమంది హీరోలు మార్కెట్ ను ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు.
వారు చేసే అన్ని సినిమాలను పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించి ప్రేక్షకులను, అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ వంటి హీరోలు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలాఉంటే మన టాలీవుడ్ టాప్ హీరోలు తెలుగు సినిమాలో వెండితెరపై కనిపించి ఎన్ని రోజులు అవుతుందో ఇప్పుడు చూద్దాం.
మెగాస్టార్ చిరంజీవి ఆఖరు గా నటించిన చిత్రం సైరా. ఈ చిత్రం విడుదలై 685 రోజులు అయ్యింది. రూలర్ సినిమాలో కనిపించి బాలకృష్ణ 606 రోజులు దాటిపోయింది. మహేష్ బా బు సూపర్ హిట్ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమా లో గత సంక్రాంతి కి ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా వచ్చి 586 రోజులు అయింది. ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు పూర్తయింది. ఆఖరుగా ఆయన సాహో సినిమాలో కనిపించాడు. ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా విడుదలై 583 రోజులు అయ్యింది. అల్లుఅర్జున్ 949 రోజులు, రామ్ చరణ్ 613 రోజులు, నాగచైతన్య 704 రోజులు, విజయ్ దేవరకొండ 600 రోజులు, నాని 550 రోజులు గా వెండితెరమద ప్రేక్షకులను అలరించలేకపోయారు.మరి తొందరలోనే థియేటర్లలోకి వస్తున్న వీరు ప్రేక్షకులను ఈమేరకు అలరిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: