
లక్షమంది నా టార్గెట్.. మనసులో మాట చెప్పిన కమెడియన్ అలీ?
తెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని దశాబ్దాల నుంచి ఒక గొప్ప కమెడియన్ గా కొనసాగుతున్నాడు అలీ. తనదైన శైలిలో కామెడీ చేస్తూ అటు ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం కేవలం కమెడియన్ గా మాత్రమే కాకుండా అటు వ్యాఖ్యాతగా కూడా పలు కార్యక్రమాలు చేస్తున్నాడు. అయితే ఇటీవలే కమెడియన్ అలీ అటు సాయికుమార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న వావ్ అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు. ఇక అలీతో పాటు రాజారవీంద్ర, సుమన్శెట్టి, కరాటే కళ్యాణి కూడా వచ్చారు.
ఈ క్రమంలోనే కమెడియన్ అలీ తన జీవిత లక్ష్యం ఏంటి అన్న విషయాన్ని చెప్పి ఎంతోమంది మనసులు గెలుచుకున్నాడు. తనకి ఒక ట్రస్ట్ ఉందని ఆ ట్రస్టు ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నానని అయితే ఇక ట్రస్ట్ ద్వారా ఏకంగా లక్ష మందికి సహాయం చేయడమే నా లక్ష్యం అంటూ కమెడియన్ అలీ తెలిపారు. ప్రస్తుతం తన ట్రస్టులో పదివేల మంది సహాయం పొందుతున్నారని ఇంకా 90 వేల మందికి సహాయం చేయాల్సి ఉందని తన జీవితంలో ఇదే లక్ష్యంగా పెట్టుకున్నాను అంటూ కమెడియన్ అలీ తెలిపాడు. కాగా కమెడియన్ అలీ గొప్ప మనసు కు ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోతున్నారు.