త్వరలోనే నెరవేరనున్న నాగచైతన్య-సమంత కల..?

Suma Kallamadi
మోస్ట్ సక్సెస్ ఫుల్ టాలీవుడ్ పెయిర్ గా రాణిస్తున్న నాగచైతన్య, సమంత విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో మంచి ఇల్లు కొనుగోలు చేసి లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు. ఈ దంపతులు సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలు చేస్తూ.. బ్రాండ్ అంబాసిడర్లుగా మారి 2 చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. పూర్తిగా సినిమాలకు దూరం అయ్యే లోపు సరిపడినంత డబ్బు సంపాదించాలని.. అలాగే మంచి స్థిర ఆస్తులు ఏర్పరుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.



సమంతాకి గోవాలోని తీరప్రాంతంలో ఒక ఫాంహౌస్ నిర్మించాలనే ఆశ ఉందట. బీచ్ కి ఎదురుగా ఉన్న ఫాంహౌస్ లో సరదాగా ఎంజాయ్ చేయాలని ఆమె చాలా రోజుల నుంచి ఆశ పడుతున్నారట. నాగచైతన్య కూడా సమంత కోసం మంచి ఫామ్ హౌస్ నిర్మించాలని ప్రయత్నిస్తున్నారట. అయితే ఇటీవల వారికి ఒక మంచి ఓపెన్ ప్లేస్ కనిపించిందట. దీంతో వారు వెంటనే కోట్ల రూపాయలు చెల్లించి ఆ భూమిని దక్కించుకున్నారు అని సమాచారం. ఇప్పటికే ఫామ్ హౌస్ నిర్మాణం కూడా ప్రారంభమయిందని తెలుస్తోంది. దాంతో త్వరలోనే అక్కినేని దంపతుల కల నెరవేరనున్నట్లు తెలుస్తోంది.



సినిమాల విషయానికొస్తే.. నాగచైతన్య వచ్చే నెలలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'థాంక్యూ' మూవీ షూట్‌ను తిరిగి ప్రారంభిస్తారు. ఆయన సాయి పల్లవి తో కలిసి నటించిన లవ్ స్టోరీ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫిదా స్థాయిలో ప్రజాదరణ పొంది నాగ చైతన్య కి మంచి హిట్ తెచ్చి పెడుతుందో లేదో చూడాలి. ఇక సమంత శాకుంతలం సినిమా చిత్రీకరణ పూర్తిచేశారు. ఇది వచ్చే ఏడాది థియేట్రికల్ రిలీజ్‌ కానుంది. విఘ్నేశ్‌ శివన్ డైరెక్షన్ లో రూపొందుతున్న ‘కాత్తు వాక్కుల రెండు కాదల్‌’ మూవీ లో కూడా సమంత నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: