నేనొక సెంటిమెంటల్ ఫూల్.. అందుకే నా కెరీర్ ఇలా ఉంది: మంచు విష్ణు

praveen
మంచు విష్ణు..  ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న హీరోల్లో ఒకరు. పెద్ద బ్యాక్గ్రౌండ్ తోనే తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అయినప్పటికీ ఇంకా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు ఈ హీరో. అయితే కెరీర్ మొదట్లో  మంచు విష్ణు చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. దీంతో ఇక తక్కువ సమయంలోనే విష్ణు స్టార్ హీరో గా ఎదుగుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాత్రం విష్ణు సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ కరువైంది.  కథలు ఎంపిక సరిగా లేకపోవడంతో ఇక మంచు విష్ణు సినిమాలు ఫ్లాపులు గానే మిగిలిపోయాయ్.



 ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఒక మంచి హిట్ కొట్టేందుకు ఎన్నో ప్రయోగాలు చేసినప్పటికీ ఇక ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతూ ఉండటం గమనార్హం. అయితే మంచు ఫ్యామిలీ లాంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇక మంచి టాలెంట్ ఉన్న ప్పటికీ విష్ణు ఇంకా ఎందుకు స్టార్డమ్ సంపాదించిన లేక పోతున్నాడు అన్నది అటు తెలుగు ప్రేక్షకులు కూడా చిక్కు వీడని ప్రశ్న అని చెప్పాలి. కాగా తన కెరియర్ సక్సెస్ఫుల్గా లేకపోవడానికి తానే కారణమంటూ ఇటీవల మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేశాడు..  కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా ఈటీవీ లో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా ఈ కార్యక్రమానికి  అతిథిగా వచ్చాడు మంచు విష్ణు.



 ఈ క్రమంలోనే ఒక కథ మీరు వినేటప్పుడు ఆ కథను ఇలా ఓకే చేస్తారు అంటూ అలీ ప్రశ్నించాడు. అయితే నా కెరీర్ లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటేనే మంచి డైరెక్టర్లను ఎన్నుకోకపోవడమే అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. దీనికి కారణం నా ఫూలిష్ నెస్ అంటూ చెప్పుకొచ్చాడు. నేనొక సెంటిమెంటల్ ఫూల్ ని అంటూ మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ చేస్తాడు. ఇలా ఏకంగా నా కెరియర్లో నాలుగు పెద్ద మిస్టేక్స్ ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇలా ఒక రకంగా తన కెరీర్ నాశనం కావడానికి తానే కారణం అంటూ  ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో మంచు విష్ణు తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: