బాలీవుడ్ లో 'జల్సా'. మూవీ.. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో?
ఇప్పుడు మరికొన్ని రోజుల్లో మరో జల్సా సినిమా రాబోతుంది.. అదేంటి జల్సా సినిమాకు సీక్వెల్ తీస్తే జల్సా 2 అని వస్తుంది కానీ అదే పేరుతో సినిమా రావడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారు కదా. అయితే ఇప్పుడు జల్సా సినిమా తీసేది పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాదు. ఏకంగా బాలీవుడ్ లో జల్సా సినిమా తీయబోతున్నారు. ఓహో పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అదే పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారా అని అంటారు.. అబ్బే అలా అనుకున్నారూ అంటే మీరు పప్పులో కాలేసినట్లే.. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జల్సా మూవీ టైటిల్ తో బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఒక సినిమా చేస్తోంది.
t series, అబుడెన్షియా ఎంటర్టైన్మెంట్ కలిసి ఇక ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. ఇక ఇటీవల సెట్స్ మీదికి వెళ్లిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. విద్యాబాలన్ తో పాటు మరో హిందీ నటి షేఫలి షా కూడా మరొక కీలకమైన పాత్రలో కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది ఇక ఈ సినిమాకు సురేష్ దర్శకత్వం వహిస్తున్నారు. తుమ్ హరి సులు అనే సినిమాను తెరకెక్కించిన సురేష్ త్రివేణి ఇక ఈ సినిమాకు రచనా సహకారం కూడా అందిస్తూ ఉండడం గమనార్హం .