దేవుడు నాకు అందం ఇవ్వకుండా ఉండాల్సింది : సింగర్ సునీత

frame దేవుడు నాకు అందం ఇవ్వకుండా ఉండాల్సింది : సింగర్ సునీత

praveen
టాలీవుడ్ లో సింగర్ సునీత కు మంచి క్రేజ్ ఉంది మ్ ఒక సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. అంతేకాకుండా తన చిరునవ్వుతో ఎంతో మంది మనసులు కొల్లగొట్టింది సింగర్ సునీత. అయితే సింగర్ సునీత గురించి ఎప్పుడూ సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త హల్చల్ చేస్తోంది. అయితే గతంలో తనపై వస్తున్న వార్తల విషయంలో సైలెంట్ గానే ఉన్న సింగర్ సునీత పెళ్లి తర్వాత మాత్రం తనపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ చెక్ పెడుతూ వస్తోంది. ఇక ఇటీవలే ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలొ సింగర్ సునీత తన పర్సనల్ లైఫ్ గురించి ఓపెన్ అయ్యింది.



 భూదేవికి ఉన్నంత సహనం తనలో ఉంది అంటూ చెప్పుకొచ్చింది సింగర్ సునీత. అంతే కాదు ఇండియాలో సినీ సెలబ్రిటీల ను అందరూ పబ్లిక్ ప్రాపర్టీలుగా భావిస్తూ ఉంటారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. అదేసమయంలో తన పర్సనల్ విషయాలపై కూడా ఓపెన్ అయింది సింగర్ సునీత. నన్ను ఎవరు కామెంట్ చేస్తున్నారు ఎందుకు కామెంట్ చేస్తున్నారు అన్న విషయాన్ని అసలు పట్టించుకోను.. ఆ విషయం గురించి ఆలోచించే సమయం కూడా ఉండదు.. అందుకే ఇంత కూల్ గా ఉండగలుగుతున్నా అంటూ చెప్పుకొచ్చింది.



 అదే సమయంలో ఎందుకు నన్నే కామెంట్ చేస్తున్నారు అన్నది కూడా ఆలోచించను.. ఎందుకంటే నాలో కొన్ని కాంబినేషన్స్ అలా ఉన్నాయి అంటూ తెలిపింది. దేవుడు నాకు మంచి గొంతు ఇచ్చాడు.. అక్కడితో ఆపేసి ఉంటే బాగుండేది.. కానీ కొంచెం అందం కూడా ఇచ్చాడు.. అక్కడితో కూడా ఆపకుండా సినిమా ఫీల్డ్ లోకి వెళ్లి  నిరూపించుకునే అవకాశం ఇచ్చాడు. కనీసం సక్సెస్ ఇవ్వకపోయినా బాగుండేదేమో ఇలా దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఇలా ఒక వ్యక్తి ఎవరైనా అన్ని రకాల పనులు చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ వెళ్లడం చాలా కష్టం అంటూ సునిత కామెంట్స్ చేసింది. ఒక మహిళగా తాను ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటున్నాను. ఈ విషయాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. మగవాళ్లే కాదు కొంత మంది మహిళలు కూడా తట్టుకోలేకపోతున్నారు అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది సునీత.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: