నా కొడుకుకి బీర్ అంటే తెలియదు : చలపతి రావు
అంతేకాకుండా తాను ప్రేమ వివాహం చేసుకున్నానిని పెళ్లి అయిన తొమ్మిదేళ్లకే తన భార్య మృతి చెందిందని వెల్లడించారు. అప్పటికే ఆయనకు ఇద్దరు కూతుళ్ళు మరియు ఒక కుమారుడు రవి బాబు పుట్టాడు అని చెప్పారు. అయితే తాను సినిమాలలోకి వచ్చిన సమయంలో తన భార్య ఎంతో సహకారం అందించేదని చెప్పారు. తన భార్యకు ఎంతో ధైర్యం ఉండేదని... తనకు పాత్రలు ఇవ్వాలని శోభన్ బాబు కంటే తాను ఏం తక్కువ అని ఎన్టీఆర్ గారిని అడిగేది అని చెప్పారు. సినిమాల్లోకి వచ్చే ముందు తన భార్య మందు తాగడం అమ్మాయిలతో తిరగడం లాంటివి చేయకూడదని తనను కోరిందని చెప్పారు.
ఆమె కోరిక మేరకు తానెప్పుడూ మద్యం సేవించలేదని ఇతర అలవాట్లకు కూడా దూరంగా ఉన్నానని అన్నారు. తన భార్య చనిపోయిన తర్వాత పిల్లలను చూసుకునేందుకు తాను మళ్లీ పెళ్లి చేసుకోలేదని అన్నారు. ఎంతో కష్టపడి వారిని చదివించాలని చెప్పారు. వారు కూడా అదేవిధంగా చదువులపై శ్రద్ధ చూపించి ప్రస్తుతం ఉన్నత స్థానంలో ఉన్నారని అన్నారు. తన ఇద్దరు కుమార్తెలు బాగా చదువుకొని అమెరికాలో సెటిల్ అయ్యారు అని అన్నారు. ఇక రవి బాబు సినిమా దర్శకుడిగా, నటుడిగా పేరు తెచ్చుకున్నారు అని చెప్పారు. తనలాగే తన కుమారుడు కూడా మద్యం సేవించడని ఎలాంటి చెడు అలవాట్లు లేవు అని చెప్పారు. ఇప్పటికీ బాబు బీరు కూడా తాగడు అని అన్నారు. తన పని తను చేసుకుంటాడని తెలిపారు.