డిసప్పాయింట్ లో డార్లింగ్ ఫ్యాన్స్..!

NAGARJUNA NAKKA
దర్శకధీరుడు రాజమౌళికి పోటీ ఇవ్వడం చాలా కష్టం. టాలీవుడ్‌ నుంచి మొదలుపెడితే బాలీవుడ్‌ వరకు కమర్షియల్‌ మూవీస్‌లో రాజన్నకి కాంపిటీటర్స్‌ ఎవ్వరూ లేరని ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌ ఒపీనియన్ ఉంది. ఇలాంటి జక్కన్నకి టఫ్‌ కాంపిటీషన్ ఇస్తున్నాడు ప్రభాస్. 'బాహుబలి' నుంచి రాజమౌళి సినిమా అంటే ఒక బ్రాండ్ అనే ఇమేజ్ క్రియేట్ అయ్యింది. బాలీవుడ్‌లో కూడా రాజమౌళి మార్క్‌తో సినిమా బిజినెస్ పెరుగుతుంది. కొంచెం లేట్‌గా సినిమా తీసినా, సర్‌ప్రైజింగ్‌గా ఉంటుందని బాక్సాఫీస్‌ కూడా నమ్ముతుంటుంది. అయితే ఇప్పుడీ ఆలస్యం అనే కాన్సెప్ట్‌లో రాజమౌళితో పోటీపడుతున్నాడు ప్రభాస్.  

ప్రభాస్ కెరీర్‌ని కంప్లీట్‌గా మార్చేసిన సినిమా 'బాహుబలి'. ఈ మూవీ తర్వాత డార్లింగ్‌ ఇమేజ్‌ నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లింది. రీజనల్‌ స్టార్ నుంచి పాన్ ఇండియన్ హీరోగా ఎదిగాడు. వరల్డ్‌ క్లాస్ టెక్నీషియన్స్‌తో కలిసి సినిమాలు చేస్తున్నాడు. అయితే సడన్‌గా వచ్చిన మార్పులతో చాలా స్పీడ్‌గా భారీ సినిమాలకి సైన్ చేస్తున్నాడు గానీ, అంత స్పీడ్‌గా సినిమాలు పూర్తి చేయలేకపోతున్నాడు ప్రభాస్.

ప్రభాస్‌ మాహిష్మతి సామ్రాజ్యంలో అడుగుపెట్టాక అయిదేళ్ల పాటు మరో సినిమా గురించి ఆలోచించలేదు. 'బాహుబలి-2' పూర్తయ్యాకే 'సాహో' సెట్స్‌లో అడుగుపెట్టాడు. అయితే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ కోసం ప్రభాస్ రెండేళ్లు తీసుకున్నాడు. ప్రభాస్‌ 'సాహో' తర్వాత 'రాధేశ్యామ్' సినిమాకి సైన్ చేశాడు. వింటేజ్‌ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమాని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ కరోనా లాక్‌డౌన్లతో ఈ మూవీ షూటింగ్‌కి చాలాసార్లు బ్రేకులు పడ్డాయి. దీంతో జులై చివర్లో విడుదల కావాల్సిన 'రాధేశ్యామ్' మళ్లీ పోస్ట్‌పోన్ అయ్యింది.

ప్రభాస్‌ 'సలార్, ఆదిపురుష్' సినిమాలకి కూడా కరోనా లాక్‌డౌన్లతో బ్రేకులు పడ్డాయి. దీంతో ఈ సినిమా షూటింగ్‌లు పూర్తవ్వడానికి కూడా చాలా టైమ్‌ పడుతోంది. ఇక వరల్డ్‌ క్లాస్‌ పిక్చర్ అని చెప్తోన్న 'ప్రాజెక్ట్ కె'కి అయితే 200 రోజులు కేటాయించాడట ప్రభాస్. అంటే ఈ సినిమా షూటింగ్‌కే ఏడాదికి పైగా టైమ్‌ పడుతుందని చెప్పొచ్చు. దీంతో ప్రభాస్ ఒక్కో సినిమానికి మినిమం రెండేళ్లు తీసుకుంటూ రాజమౌళితో పోటీపడుతున్నాడని కామెంట్ చేస్తున్నారు జనాలు. ప్రభాస్ సినిమాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: