సమంత ఆ స్టార్ డైరెక్టర్ సినిమా మిస్ చేసుకుందా?
సమంత మంచి అవకాశాలతో దూసుకు పోతున్న స్టార్ హీరోయిన్.సమంత ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమయింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. నాగచైతన్య, సమంత జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఏమాయ చేసావే సినిమాతో సమంత అందరిని మాయ చేసింది. ఈ సినిమాలో ఈ అమ్మడి లుక్స్, యాక్టింగ్ అందరిని కట్టిపడేశాయి. ఈ సినిమా తరువాత ఈ అమ్మడుకి అవకాశాలు వెల్లువలా వచ్చి పడ్డాయి.
జూనియర్ ఎన్టీఆర్ సరసన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత మహేష్, శ్రీను వైట్ల దూకుడు సినిమాలో ఆమెకు బంపర్ ఆఫర్ వచ్చింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా చేసి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో సమంత స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఈ సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళి సినిమా ఈగ తో సమంతకు భారీ ఆఫర్ వచ్చింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించింది. నటనలో తానేంటో సమంత ఈ సినిమాతో మళ్ళీ నిరూపించుకుంది. ఈ సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
సమంత వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ మంచి విజయాలు అందుకుంది. అదే సమయంలో ఒక భారీ ఆఫర్ ఆమెకు వచ్చింది అది ఏమిటంటే ఇండియా జేమ్స్ కామెరూన్ అయిన శంకర్, మల్టీ టాలెంటెడ్ యాక్టర్ చియాన్ విక్రమ్ కాంబినేషనులో వచ్చిన ఐ సినిమా ఆఫర్ అమీ జాక్సన్ కంటే ముందు సమంతకు వచ్చిందట. కానీ కొన్ని హెల్త్ సమస్యల వల్ల ఆ సినిమాను తాను ఒప్పుకోలేదట. దానితో ఆ ఆఫర్ కాస్త అమీ జాక్సన్ కు వెళ్ళిపోయింది.ఐ సినిమా బాగానే ఉన్న శంకర్ సినిమాకు ప్రేక్షకులు ఊహించిన అంచనాలు ఈ సినిమా అందుకోలేక పోయింది. కానీ ఈ సినిమాలో నటించిన చియాన్ విక్రమ్, అమీ జాక్సన్ కు మంచి పేరు వచ్చింది. శంకర్ సినిమాను మిస్ చేసుకున్నందుకు సమంత చాలా బాధపడిందట. కానీ సమంత ఫాన్స్ మాత్రం ఈ సినిమాను సమంత చేయనందుకు చాలా సంతోషించారు అని టాక్ వినిపిస్తుంది.నాగచైతన్యను వివాహం చేసుకున్న తరువాత కూడా సమంత సినిమాలలో దూసుకుపోతుంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే పీరియడక్ సినిమా చేస్తుంది.