పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకు తిరగడం పక్కా..!

shami
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్ లో క్రేజీ మూవీగా హరి హర వీరమల్లు వస్తుంది. ఈ సినిమాలో పవన్ ఇంతవరకు కెరియర్ లో ఎప్పుడు చేయని డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టల్, లుక్ అన్ని సరికొత్తగా ఉంటాయని అంటున్నారు. పిరియాడికల్ స్టోరీగా వస్తున్న హరి హర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని టాక్.

సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఛాన్స్ అందుకోగా బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా లక్కీ ఛాన్స్ పట్టేసింది. హరి హర వీరమల్లు టైటిల్ కు తగ్గట్టుగానే సినిమా ఏమాత్రం అంచనాలకు తగ్గకుండా ఉంటుందని అంటున్నారు చిత్రయూనిట్. ఇక లేటెస్ట్ గా సినిమాకు రైటర్ గా పనిచేస్తున్న సాయి మాధవ్ సినిమాపై మరింత అంచనాలు పెంచారు. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో అద్భుతంగా వస్తుందని సినిమా చూసిన తర్వాత పవర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకుని తిరుగుతారని చెప్పాడు.

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఈ సినిమా స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెబుతున్నారు. సినిమాలో చాలా సర్ ప్రైజెస్ ప్లాన్ చేశాడట క్రిష్. ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా కథ, కథనాలు ప్రేక్షకులను ఓ మంచి అనుభూతిని అందిస్తాయని అంటున్నారు. కెరియర్ లో ఫస్ట్ టైం ప్రయోగాత్మక సినిమా చేస్తున్న పవర్ స్టార్ సినిమాతో తప్పకుండా ఆశించిన దానికన్నా ఎక్కువ రేంజ్ లో హిట్ అందుకుంటాడని అంటున్నారు. ఈ సినిమాతో పాటుగా అయ్యప్పనుం కోషియం రీమేక్ లో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ తో రానా కూడా నటిస్తున్నారు. హరీష్ శంకర్ తో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. 2022 స్టార్టింగ్ లో ఈ సినిమా ఉండొచ్చని టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: