మహేష్ అక్క మంజుల పెళ్లి వెనక ఇంత తంతు నడిచిందా ?
ఆమె గతంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది. యువరత్న నందమూరి బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా ఆమెను నటింప జేద్దామన్న ప్రయత్నాలు అయితే జరిగాయి. అయితే అప్పట్లో ఎందుకో గాని ఈ విషయం బయటకు రావడంతో కృష్ణ అభిమానులకు నచ్చ లేదు. దీంతో కృష్ణ మంజులను హీరోయిన్ చేయాలన్న అంశాన్ని పక్కన పెట్టేశారు. మంజులకు హీరోయిన్ అవ్వాలన్న కోరిక ఎంత బలంగా ఉన్నా కృష్ణ ఒప్పుకోకపోవడంతో అది పట్టాలు ఎక్కలేదు.
మంజుల - సంజయ్ ది ప్రేమ వివాహం. వీరిద్దరు ఏకంగా ఏడు సంవత్సరాల పాటు ప్రేమించుకున్నారట. అయితే పెద్దలను ఒప్పించాకే పెద్ద తిరుపతిలో వీరు చాలా సింపుల్ గా ప్రేమ వివాహం చేసుకున్నారు. మంజుల పెళ్లికి ముందుగా కృష్ణ ఒప్పుకోలేదట. అయితే మంజుల తల్లి ఇందిర మాత్రం తన ప్రేమ పెళ్లికి బాగా సపోర్ట్ చేసినట్లు మంజుల తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇక ఏమాయ చేశావే, పోకిరి లాంటి సినిమాలు నిర్మించిన మంజుల యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన మనసుకు నచ్చింది సినిమాకు దర్శకత్వం వహించగా.. ఆ సినిమా ప్లాప్ అయ్యింది.