ఆ డ్రెస్ వేసుకుని 50 రోజులు ఉన్నా...హీరో వెంకటేష్ ఎమోషనల్ ?

Veldandi Saikiran
టాలీవుడ్ పరిశ్రమలో విక్టరీ వెంకటేష్... ఎప్పుడు మొదటి వరుసలోనే ఉంటారు. ప్రతి సినిమాలోనూ ఎమోషనల్ సీన్లతో పాటు కామెడీ జోడి నుంచి ప్రేక్షకులను కనువిందు చేస్తాడు విక్టరీ వెంకటేష్. ఆయన కెరీర్ ప్రారంభం నుంచి ప్రతి సినిమాలోనూ కామెడీ అనేది కామన్ గా ఉంటుంది. ఇదిలా ఉండగా ఇటీవలే హీరో విక్టరీ వెంకటేష్ నారప్ప సినిమాను పూర్తి చేసుకున్నాడు. ఈ సినిమా మా స్టార్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వస్తోంది. అటు ఈ మూవీలో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది.


 చాలా గ్యాప్ తర్వాత ప్రియమని వెంకటేష్ సరసన నటిస్తోంది. అయితే కరోనా మహమ్మారి కారణంగా... ఈ సినిమా షూటింగ్ పలుసార్లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎంతో పట్టుదలతో ఈ సినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంది అని చిత్ర బృందం. ఇక మూడో వేవ్ రానున్న తరుణంలో ఈ సినిమాను ఓ టి టి లో రిలీజ్ చేయాలని చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. నారప్ప సినిమా బృందం నిర్ణయం మేరకు... ఈనెల 20న అంటే రేపు అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. అయితే సినిమా విడుదల నేపథ్యంలో విక్టరీ వెంకటేష్ ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా విషయాలను పంచుకున్నారు.


ఇప్పటి వరకూ తాను చేసిన సినిమాల కంటే నారప్ప మూవీ చాలా స్పెషల్ గా ఉంటుందని వెంకటేష్ తెలిపారు. అలాగే ఈ సినిమా షూటింగ్ సమయంలో ... తాను ఒకే డ్రెస్ ను 50 రోజులు వేసుకున్నారని చెప్పారు. నారప్ప ట్రైలర్ లో కనిపించే ఆ డ్రెస్... యాభై రోజుల పాటు వేసుకున్నాం అని చెప్పారు.  ఈ మూవీ లో చాలా డైలాగులు బాగుంటాయి అని వెల్లడించారు వెంకటేష్.... ఇక ఈ మూవీలో క్యారెక్టర్ కు తాను మాత్రమే సెట్ అవుతానని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: