సెలబ్రిటీలు ఏం చేసినా... ఇట్టే వైరల్ అవుతుంది. అది బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు నడుస్తున్న ట్రెండ్. బాలీవుడ్ స్టార్లు.. కానీ టాలీవుడ్ స్టార్లు కానీ... పొద్దున లేసిన నుంచి నైట్ వరకు ఏదో ఒక చిలిపి పనులు, ఇంకా ఇతర పనులు చేస్తూ... సోషల్ మీడియాలో పెడుతారు. దీంతో ఆ ఫోటోలు కాస్త... వైరల్ అవుతుంటాయి. అయితే... ఫేమస్ బాలీవుడ్ స్టార్ నేహా ధూపియాకు సంబంధించిన ఓ ఫోటో వైరల్ అయింది. నేహా ధూపియా రెండో సారి కూడా తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా ఫ్యామీలేనే స్పష్టం చేశారు.
బేబీ బంప్‌తో చిత్రాలను దిగి.. వాటిని తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు నేహా ధూపియా దంపతులు. అంతేకాదు... ఈ ఫోటోలకు తమ స్టైల్ లో క్యాప్షన్ కూడా పెట్టారు నేహా ధూపియా దంపతులు. '' మేం ఎప్పటి నుంచో చెప్పాలను కున్నాం. మేం ఆలోచన చేసిన వాటిల్లో ఇదే చాలా ముఖ్యమైంది.'' అంటూ నేహా ధూపియా దంపతులు తమ ఫ్యామిటీ ఫోటోలను షేర్ చేశారు. దీంతో ఆ ఫోటోలు కాస్త.. ఇట్టే వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు... సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక ఈ ఫోటోలను చూసిన నేహా ధూపియా ఫ్యాన్స్... కంగ్రాట్స్ చెబుతున్నారు. మరి కొందరైతే.... షాక్ గురైనట్లు కామెట్లు పెడుతూ.. రచ్చ చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా... నేహా ధూపియా అండగ్ బేడి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. నేహా ధూపియా వివాహం 2018 మే మాసంలో జరిగింది. అయితే... వివాహం అయిన ఏడాదే... నేహా ధూపియా దంపతులకు మెహర్ అనే కూతురు కు జన్మనించింది. ఇక తాజాగా మరో సారి నేహా ధూపియా తల్లి కాబోతుండటంతో... ఆమె ఫ్యామిలీ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా... నేహా ధూపియా... 2003 సంవత్సరంలో ''ఖయామత్ ; సిటీ అండర్ థ్రేట్'' అనే మూవీతో బాలీవుడ్ పరిశ్రమలో కి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.