నాని కోసం సమంత అంత రిస్క్ తీసుకుంటుందా..?
నాని నిర్మాతగా చేస్తే అది కచ్చితంగా ప్రయోగమే అయ్యి ఉండాలని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు అందుకే చాలా సెలెక్టెడ్ స్టోరీస్ ఎంచుకుని చేస్తున్నాడు. మీట్ క్యూట్ తర్వాత సమంతతో మరో ఫీమేల్ సెంట్రిక్ సినిమా ప్రయత్నాల్లో ఉన్నాడట సమంత. అయితే సమంత అంత ఈజీగా సినిమాలను ఒప్పుకోవట్లేదు.. పెళ్లి తర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్త పడుతుంది సాం. ఇదివరకులా ఏ స్క్రిప్ట్ అయినా ఓకే అనేలా లేదు. అందుకే నాని సమంతని ఒప్పించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే నాని కోసమైనా సమంత ఓసారి స్క్రిప్ట్ వినాలని అనుకుంటుందట.
స్క్రిప్ట్ బాగా రావడంతో సమంతని ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నాల్లో ఉన్నాడట నాని. సమంత నాని కోసం రిస్క్ తీసుకుంటుందా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాలో సమంత ఓకే అంటే నాని కూడా ఒక మంచి రోల్ లో నటిస్తాడని టాక్. ప్రస్తుతం సమంత గుణశేఖర్ డైరక్షన్ లో శాకుంతలం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కథలైతే వింటున్నా ఏది సమంతకి నచ్చట్లేదని టాక్. అందుకే నాని కూడా సమంత తన సినిమా ఓకే చేస్తుందా లేదా అన్న ఆలోచనలో ఉన్నాడని తెలుస్తుంది.