జక్కన్న చేతుల మీదుగా హిందీ చత్రపతి లాంచ్.. !

MADDIBOINA AJAY KUMAR
అల్లుడు శీను సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమాతో సాయి శ్రీనివాస్ సూపర్ హిట్ అందుకుకోలేక పోయినప్పటికీ ప్రేక్షకులకు మాత్రం పరిచయమయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ సాయి శ్రీనివాస్ బిజీ అయ్యారు. అంతేకాకుండా తన సినిమాలలో స్టార్ హీరోయిన్ల కు అవకాశం ఇస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. ఇక సాయి శ్రీనివాస్ ఇప్పటివరకు చాలానే సినిమాలు చేసినప్పటికీ ఆయనకు మంచి హిట్ ఇచ్చింది మాత్రం "రాక్షసుడు" సినిమా అనే చెప్పాలి. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో సాయి శ్రీనివాస్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు యంగ్ హీరో బాలీవుడ్ పై కన్నేసిన సంగతి తెలిసిందే. చత్రపతి సినిమా హిందీ రీమేక్ తో సాయి శ్రీనివాస్ బాలీవుడ్ కు పరిచయం కాబోతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు వి.వి వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా ఛత్రపతికి కథను అందించిన విజయేంద్రప్రసాద్ ఈ సినిమా కూడా స్క్రిప్టు అందిస్తున్నారు.

అయితే ఈ సినిమా చత్రపతి రీమేక్ అయినప్పటికీ బాలీవుడ్ కు తగినట్టుగా విజయేంద్రప్రసాద్ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను శుక్రవారం హైదరాబాదులో జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శక ధీరుడు రాజమౌళి హాజరయ్యారు. అంతే కాకుండా జక్కన్న క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు ఇక రాజమౌళి తో పాటు ఈ సినిమా పూజా కార్యక్రమానికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ మరియు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా హాజరయ్యారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు వివరాలను కూడా వెల్లడించనున్నారు. ఇక ఈ సినిమా పై సాయి శ్రీనివాస్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ నుండి పలువురు బాలీవుడ్ లో ఛాన్స్ లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. కానీ సాయి శ్రీనివాస్ నేరుగా టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరి సినిమా సాయి శ్రీనివాస్ కు ఎలాంటి విజయాన్ని ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: