నేను కోటిశ్వరున్ని... ఇప్పుడంటే ఇప్పుడే కోట్లు రాలుతాయి?

Veldandi Saikiran
సినీ సీనియర్ నటుడు ఆర్.నారాయణమూర్తి.... ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రజా కోణంలో, ప్రజల కోసం, విప్లవాత్మక చిత్రాలను ఆర్ నారాయణ మూర్తి తీశారు. ఆయన హీరోగా తీయడమే కాకుండా... స్వయంగా తానే డైరెక్షన్ చేసుకొని చాలా మూవీలు చేశారు. అయితే నారాయణ మూర్తిని స్వయంగా చూస్తే... ఆయన చాలా సింపుల్గా మనకు కనిపిస్తారు. ఆర్.నారాయణమూర్తి ఆడంబరాలు లేకుండా సాధారణ జీవితం గడపడానికి చాలా ఇష్టపడతారు. కార్లు,  బంగ్లాలు అంటూ అవి ఏవి ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు.  

ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే... ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు ఆర్ నారాయణ మూర్తి. ప్రజల కోసం, నిరంకుశ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సినిమాలు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆర్ నారాయణ మూర్తి. వివాదాస్పద వ్యాఖ్యలకు ఈయన ఆమడ దూరంలో ఉంటారు. అలాంటి ఆర్ నారాయణ మూర్తి గురువారం నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కోటీశ్వరుని... ఇప్పుడంటే ఇప్పుడే కోట్లు రాలుతాయాని కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్ నారాయణమూర్తి. తాను ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నానని అని చెప్పు వచ్చిన ఆర్ నారాయణ మూర్తి ఎంతో ధనికున్ని అన్నారు.  తనకు ఏదైనా అవసరం వస్తే తెలుగు పరిశ్రమలో చాలామంది పెద్దలు తనకు సహాయం చేస్తారని పేర్కొన్నారు.

అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్  మరియు జగన్ ఇలా చాలా మంది తనకు సహాయం చేస్తామని చాలాసార్లు చెప్పారని ఆయన వెల్లడించారు. గతంలో టిడిపి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు కూడా తనకు హెడ్ క్వార్టర్స్ ఇస్తానని అని హామీ ఇచ్చారని... కానీ కానీ తీసుకోలేదని వెల్లడించారు. కానీ కొంతమంది సోషల్ మీడియా లో తాను చాలా దీన స్థితిలో ఉన్నట్లు పోస్ట్ లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్ నారాయణ మూర్తి.  ఆ పోస్టులు తనను చాలా బాధించాయని చెప్పుకొచ్చారు.  జర్నలిజం అంటేనే అవినీతి... అక్రమాలను బయటికి తీయడం అని... కానీ ఇలాంటి చెత్త వార్తలు రాయకూడదని చురకలంటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: