RRR ఆఖరి పాటకి అన్ని కోట్ల ఖర్చు..!

shami
రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, చరణ్ చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. సినిమాకు సంబదించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఈ షెడ్యూల్ లో ఒక భారీ సాంగ్ షూటింగ్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ సాంగ్ కోసం 3 కోట్ల బడ్జెట్ కేటాయించారట. సినిమా క్వాలిటీ విషయంలో తనకు రావాల్సిన అవుట్ పుట్ రాబట్టే విషయంలో అసలు కాంప్రమైజ్ అవడు మన రాజమౌళి అందుకే ఆయన సక్సెస్ రేటు అలానే ఉంటుంది.

ఆర్.ఆర్.ఆర్ సినిమా కోసం ఒక సాంగ్ షూట్ చేస్తున్నారట. ఈ సాంగ్ లో నటీనటుల కాస్ట్యూమ్స్ కోసమే కోటి రూపాయల దాకా ఖర్చు చేశారని టాక్. ఇక సాంగ్ మొత్తం 3 కోట్ల దాకా ఖర్చు అవుతుందట. సినిమాలో ఈ సాంగ్ చాలా స్పెషల్ గా సినిమాకే వన్ ఆఫ్ ది హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే కచ్చితంగా ట్రిపుల్ ఆర్ లో ఈ సాంగ్ సంథింగ్ స్పెషల్ అని మాత్రం చెప్పొచ్చు. ఈ సాంగ్ లో బాలీవుడ్ భామ అలియా భట్ కూడా నటిస్తున్నారని తెలుస్తుంది.

ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్.. రామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్నారు. సినిమా కోసం ఇద్దరు హీరోలు తమ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చేస్తున్నారని అంటున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా కాబట్టి సాధారణంగానే ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక ఈ సినిమా ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అంతకుమించి అనిపించేలా ఉండాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్, చరణ్ ఇద్దరు చేసే మ్యాజిక్ కు ఆ ఇద్దరి హీరోల ఫ్యాన్స్ మాత్రమే కాదు నేషనల్ వైడ్ సినీ అభిమానులంతా ఫిదా అవుతారని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: