స్టార్ హీరోయిన్.. ప్రగ్యా జైశ్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ప్రగ్యా జైశ్వాల్ చాలా దగ్గరయ్యారు. మధ్య ప్రదేశ్ కు చెందిన ఈ భామ 2014 లో 'డేగ' సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా పెద్ద పేరు రాకపోయినప్పటికీ.. మెగా హీరో వరుణ్ మరియు దర్శకుడు క్రిష్ కాంబీనేషన్ లో వచ్చిన కంచె సినిమాతో ప్రగ్యా జైశ్వాల్ ఏ రేంజ్ కు వెళ్లింది. ఆ తర్వాత జయ జానకీ నాయక లాంటి సినిమా పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చినప్పటికీ ఈ భామకు మరో హిట్ దొరకలేదు.
ఇది ఇలా ఉండగా... తాజాగా ఈ భామ లిప్ లాక్ గురించి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసింది. ఇటీవలే సోషల్ మీడియాలో నెటిజన్లతో ఈ భామ చేసిన చాట్ లో లిప్ లాక్ పై హాట్ హాట్ గా స్పందించింది. ... మీరు ఫస్ట్ డేనే డేటింగ్ కు వెళ్లినప్పుడు లిప్ లాక్ పెడతారా ? అంటూ చాలా హాట్ గా ప్రగ్యా జైశ్వాల్ ను ఓ నెటిజన్ ప్రశ్నించాడు. అయితే... ఆ నెటిజన్ అడిగిన ప్రశ్నపై తన దైన స్టైల్ లో స్పందించింది ప్రగ్యా జైశ్వాల్. డేటీంగ్ వెళ్లినంత మాత్రాన ముద్దులు పెడతతారా... అలాంటి అందరి లైఫ్ లో జరుగదు అని బదులిచ్చింది.
అక్కడితో ఆగకుండా... తాను ఇప్పటి వరకు ఎవరి ప్రేమలో పడలేదని క్లారిటీ ఇచ్చింది ప్రగ్యా జైశ్వాల్. ఒక వేళ లవ్ లో పడినా... మొదటి రోజే లిక్ లాక్ కిస్ చేయబోనని.. మనసులు కలిసాకనే... పెదవులు కలుపుతానని స్పష్టం చేసింది. కాగా... ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్ .... బాలకృష్ణ "అఖండ " మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్.. డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఫుల్ బిజీగా ఉన్నట్లు సమాచారం.