రవితేజ టైటిల్.. నిన్న కృష్ణ.. నేడు రామారావు.. రేపు నాగేశ్వర్ రావు పెడతాడా..!

shami
మాస్ మహరాజ్ రవితేజ కొత్తగా ఓ సినిమా టైటిల్ ప్రకటించాడు. శరత్ మండవ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు రామారావు ఆన్ డ్యూటీ అని ఫిక్స్ చేశారు. రామారావు అని టైటిల్ పెట్టి నందమూరి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చాడు రవితేజ. ఈ సినిమాలో రవితేజ ఎమ్మార్వోగా కనిపిస్తారని తెలుస్తుంది. అయితే రామారావు టైటిల్ చూసి షాక్ అవుతున్నారు. అంతకుముందు కూడా రవితేజ కృష్ణ అనే టైటిల్ తో సినిమా చేశాడు. వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెప్పించింది.

అప్పుడు కృష్ణ టైటిల్ తో వచ్చిన రవితేజ ఇప్పుడు రామారావు టైటిల్ తో వస్తున్నాడు. రామారావు, కృష్ణ ఇద్దరు తెలుగు తెర మీద నట విశ్వరూపం చూపించిన మహా నటులని మనకు తెలిసిందే. కృష్ణ, రామారావు అయ్యింది ఏదో ఒకరోజు నాగేశ్వర్ రావు, కృష్ణం రాజు, శోభన్ బాబు ల పేర్లని కూడా రవితేజ టైటిల్ గా పెట్టేస్తాడేమో అని ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా రామారావు టైటిల్ తో రవితేజ నందమూరి ఫ్యాన్స్ కు పెద్ద షాక్ ఇచ్చాడు. ఎందుకంటే ఆ టైటిల్ తో నందమూరి నట సిం హం బాలకృష్ణ సినిమా చేయాలని అనుకున్నారు.

సక్సెస్ ఫుల్ డైరక్టర్ అనీల్ రావిపుడి డైరక్షన్ లో బాలయ్య బాబు చేసే సినిమాకు రామారావు అని టైటిల్ పరిశీలనలో ఉంచారు. సినిమా కన్ ఫర్మ్ అయితే దాదాపు అదే టైటిల్ పెట్టే వారని టాక్. అయితే ఈలోగా రవితేజ తన సినిమాకు రామారావు ఆన్ డ్యూటీ అని పవర్ ఫుల్ టైటిల్ పెట్టేశాడు. మరి శరత్ మండవ రామారావు అని పవర్ ఫుల్ టైటిల్ అయితే పెట్టాడు మరి పవర్ ఫుల్ కథ, కథనాలు ఎంచుకున్నాడో లేదో సినిమా చూస్తేనే తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: