సునీల్ ని ఫుల్లుగా వాడేస్తున్న అనీల్ రావిపుడి.. f3లో ఆయనే హైలెట్..!
f3లో సునీల్ ఏదో ఉన్నాడు అంటే ఉన్నాడన్నట్టు కాకుండా వెంకీ, వరుణ్ ల పాత్రలకు ఈక్వల్ రోల్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ పాత్ర చాలా బాగా వస్తుందని సినిమాకు సునీల్ పాత్రే హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. అనీల్ రావిపుడి కామెడీ రైటింగ్ లో సునీల్ యాక్టింగ్ అంటే తప్పకుండా ఆడియెన్స్ కు మంచి నవ్వుల ఫీస్ట్ అందిస్తారనే చెప్పాలి. మొన్నటిదాకా హీరోగానే చేస్తూ కమెడియన్ పాత్రలు వద్దనుకున్న సునీల్ ఫైనల్ గా మళ్లీ తన పాత పంథా కొనసాగించాలని చూస్తున్నాడు.
పుష్పలో విలన్ గా f3లో కమెడియన్ గా సునీల్ చేస్తున్న రెండు సినిమాలు రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటిస్తున్నాడని తెలుస్తుంది. చూస్తుంటే మళ్లీ సునీల్ తిరిగి ఫాంలోకి వచ్చేసినట్టే అని చెప్పుకోవచ్చు. f3 లో అనీల్ రావిపుడి సునీల్ ని మత్రం ఫుల్లుగా వాడేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ ల మధ్య కామెడీతో పాటుగా సునీల్ కామెడీ కూడా అదిరిపోతుందని అంటున్నారు. సో అందరు అనుకున్నట్టుగ f3లో వెంకటేష్, వరుణ్ తేజ్ మాత్రమే కాకుండా సునీల్ కూడా మరో హీరోగా సమానమైన పాత్ర చేస్తున్నాడని చెప్పొచ్చు. ఈమధ్య కొద్దిగా ఫాం లో లేనట్టు కనిపించిన సునీల్ ఈ సినిమాలతో మళ్లీ ట్రాక్ ఎక్కేలా ఉన్నాడని చెప్పుకుంటున్నారు.