సుధీర్ బాబు మందులోడా సాంగ్.. మాస్ ను ఊపేయడం పక్కా..!

shami
సుధీర్ బాబు హీరోగా పలాస డైరక్టర్ కరుణ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ మందులోడా సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి పాట మందులోడా మాంచి మాస్ బీట్ తో వచ్చింది. సినిమాలో స్పెషల్ సాంగ్ గా అనిపిస్తున్న ఈ సాంగ్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. లిరికల్ సాంగ్ తోనే మాస్ ఆడియెన్స్ ను అలరించిన ఈ సాంగ్ విజువల్ పరంగా అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు. కం బ్యాక్ తర్వాత మణిశర్మ మళ్లీ ఓ రేంజ్ లో మ్యూజిక్ అందిస్తున్నారు.

సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్ నుండి రిలీజైన మందులోడా సాంగ్ లో మాస్ స్టెప్పులతో అదరగొట్టాడు హీరో సుధీర్ బాబు. ఇన్నాళ్లు తనలోని డ్యాన్సింగ్ టాలెంట్ దాచి పెట్టిన సుధీర్ బాబు ఇప్పుడు ఆ టాలెంట్ కూడా చూపించేస్తున్నాడు. మందులోడా సాంగ్ లో మాస్ బీట్ తో అదిరిపోయే రేంజ్ లో సాంగ్ ఉంది. 70 ఎం.ఎం ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శశి దేవి రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. అభిరుచి గల నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న వారు శ్రీదేవి సోడా సెంటర్ ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఆల్రెడీ ఈ బ్యానర్ లో సుధీర్ బాబు భలే మంచి రోజు సినిమా చేశారు. ఆ సినిమాతో హిట్ అందుకున్న సుధీర్ బాబు అప్పటినుండి మంచి ఫాం కొనసాగించాడు. ఈ సినిమాతో పాటుగా సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా చేస్తున్నాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమా కూడా అంచనాలతో వస్తుంద్. శ్రీదేవి సోడా సెంటర్ తో మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేసిన సుధీర్ బాబు ఏమేరకు ప్రేక్షకులను మెప్పిస్తాడో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: