మహేష్ ను ఢీ కొట్టేది అతనే.. సర్కారు వారి పాటలో సూపర్ విలన్..!
ఇక ఈ సినిమాలో విలన్ ఎవరన్నది కొన్నాళ్లుగా జరుగుతున్న డిస్కషన్ కు ఎండ్ కార్డ్ పడ్డది. మహేష్ కు విలన్ గా అర్జున్ నటిస్తున్నాడని అన్నారు కాని ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తుంది. సర్కారు వారి పాట సినిమాలో కోలీవుడ్ నటుడు సముద్ర ఖని విలన్ గా ఫిక్స్ చేశారట. ఈమధ్య టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తున్న సముద్ర ఖని ఇక్కడ బిజీ ఆర్టిస్ట్ అవుతున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా చేస్తూ మెప్పిస్తున్నాడు. డైరక్టర్ గా అనుభవం ఉన్న సముద్ర ఖని టాలీవుడ్ లో నటుడిగా సెట్ అయ్యాడు.
అల వైకుంఠపురములో, క్రాక్ సినిమాల్లో విలన్ గా నటించి సూపర్ హిట్ అందుకున్న సముద్ర ఖని రాజమౌళి డైరక్షన్ లో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. లేటెస్ట్ గా మహేష్ సర్కారు వారి పాటలో కూడా విలన్ గా చేస్తున్నాడు. మహేష్ ను ఢీ కొట్టే విలన్ గా సముద్ర ఖని ఎలా అలరిస్తాడో చూడాలి. సర్కారు వారి పాట సినిమా షూటింగ్ మళ్లీ తిరిగి త్వరలో మొదలవుతుంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా ఇప్పటికే 50 శాతం వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది.మరో రెండు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని చూస్తున్నారు చిత్రయూనిట్.