ఫ్యాన్స్ ని వెయిటింగ్ లో పెడుతున్న అనుష్క..!
ఈ ఒక్క సినిమా తప్ప మరే సినిమా గురించి అనుష్క అప్డేట్స్ రావట్లేదు. అనుష్క కావాలని గ్యాప్ తీసుకుంటుందా.. ఆమెని మెప్పించే కథలు రావట్లేదా అన్న డౌట్ వస్తుంది. అనుష్క సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అందంతోనే కాదు అభినయంతో కూడా అదరగొట్టి స్టార్ హీరోలకు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేసుకుంది అనుష్క. అరుంథతి, రుద్రమదేవి, భాగమతి లాంటి సినిమాలు కేవలం అనుష్క మాత్రమే చేయగలదు అనిపించుకుంది. రీసెంట్ గా వచ్చిన నిశబ్ధం ఆమెను నిరాశపరచింది.
అనుష్క ఓకే అంటే ఆమెతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు రెడీగా ఉన్నారు. కాని అనుష్క కావాలనే కొద్దిపాటి గ్యాప్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. నవీన్ పొలిశెట్టి సినిమాతో పాటుగా మరో సినిమా కూడా డిస్కషన్ స్టేజ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. తప్పకుండా అనుష్క తన మరోసారి తన మార్క్ చూపించాలని ఫిక్స్ అయ్యింది. మరి ఇంకా ఎన్నాళ్లు అనుష్క తన ఫ్యాన్స్ ను వెయిటింగ్ లో పెడుతుందో చూడాలి. కమర్షియల్ సినిమాలతో పాటుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనుష్క తను నెక్స్ట్ చేసే సినిమాలు కూడా అదే తరహాలో ఉండాలని చూస్తుంది. అందుకే కథల ఎంపిక విషయంలో కొద్దిగా లేట్ అవుతుందని అంటున్నారు. భాగమతి తరహా కథలకే అనుష్క ఓటు వేస్తున్నట్టు తెలుస్తుంది. నవీన్ పొలిశెట్టి సినిమాలో కూడా అమ్మడి పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని టాక్.