అఖిల్ కెరీర్ గాడిన పడేనా... నాగార్జున పక్కా స్కెచ్ ?

VAMSI
అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని అఖిల్ హీరోగా అఖిల్, హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో మన ముందుకు వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. నటన పరంగా మంచి మార్కులే తెచ్చుకున్నా హీరోగా సరైన సక్సెస్ అందుకోవాలని తెగ ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమా తనకి సూపర్ హిట్ అందిస్తుందని గట్టి నమ్మకం పెట్టుకున్నాడు అఖిల్. ఈ చిత్రంలో అఖిల్ సరసన పూజా హెగ్డే జంటగా నటిస్తుండగా, మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపుదిద్దుకున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న అఖిల్ కు అదృష్టంగా మారుతుందని అక్కినేని అభిమానులు  ఆశిస్తున్నారు. ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డితో ఏజెంట్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. వరుసగా తీసిన చిత్రాలు నిరాశపరచడం, చేసిన సినిమాలతో ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో ఈ రెండు సినిమాల ఫలితంపై తన కెరీర్ ఆధారపడి ఉందన్నట్లు అఖిల్ ఒత్తిడిలో పడినట్లు తెలుస్తోంది. అంతేకాక పెద్ద నిర్మాతలు అఖిల్ తో సినిమా తీసేందుకు ముందుకు రావడం లేదని ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినపడుతున్నాయి. దీంతో అఖిల్ మరింత  బాధపడుతున్నారట, అయితే తన కుమారుడు అఖిల్ కి ఊరట కలింగించే విధంగా ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారట అక్కినేని నాగార్జున.

 
ఈ సినిమాకు సీనియర్ డైరెక్టర్ ని సెలెక్ట్ చేయనున్నాడట. అందులోనూ ఈ చిత్రాన్ని తన సొంత నిర్మాణ సంస్థలోనే నిర్మించనున్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ పిక్చర్స్ సినీ నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మించాలని యోచిస్తున్నారట నాగ్. తన తనయుడు కెరియర్ ఒక గాడిలో పడేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నట్లు సినీ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.  మరి ఆ సీనియర్ డైరెక్టర్ గురించి మరియు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగక తప్పేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: