రాజమౌళి సినిమా.. కీరవాణి మ్యూజిక్.. ఈ కాంబోకి తిరుగులేదు..!
ముఖ్యంగా రాజమౌళి సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. రాజమౌళి సినిమాలో చెప్పే ప్రతి సందర్భానికి తగిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తూ శభాష్ అనిపించేసుకుంటాడు కీరవాణి. చెప్పాలంటే రాజమౌళి సినిమాలో సగం క్రెడిట్ కీరవాణి మ్యూజిక్ కు ఇవ్వాల్సిందే. సినిమా తీయడంలో రాజమౌళి కష్టపడితే ఆ తీసిన సన్నివేశాన్ని తన మ్యూజిక్ తో హైలెట్ అయ్యేలా చేస్తారు కీరవాణి. రాజమౌళి, కీరవాణి ఈ ఇద్దరి కాంబినేషన్ కు తిరుగులేదని చెప్పొచ్చు.
ఇక రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాకు కూడా కీరవాణి మరోసారి తన మ్యాజిక్ చూపిస్తారని తెలుస్తుంది. జక్కన్న సినిమా అంటే కీరవాణి మ్యూజిక్ అదిరిపోవాల్సిందే. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో కూడా మ్యూజిక్ పరంగా అదరగొడతారని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో మ్యూజిక్ పరంగా ఇంకాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నారట తప్పకుండా అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా మ్యూజిక్ ఉంటుందని చెప్పుకోవచ్చు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. సినిమాలో కొమరం భీం పాత్రలో ఎన్.టి.ఆర్, రామరాజు పాత్రలో రాం చరణ్ నటిస్తున్నారు. బాహుబలి తర్వాత రాజమౌళి చెఏస్తున్న ఈ సినిమాను అంచనాలకు మించి తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో భారీగా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.