పుష్పలో సునీల్ కూడా తగ్గేదేలే అనిపిస్తాడా..!

shami
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా పుష్ప. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించాలని చూస్తున్నాడు. సినిమా ఇప్పటికే షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. గోవాలో 15 రోజుల పాటు షూటింగ్ చేసి పుష్ప పార్ట్ 1 కు గుమ్మడికాయ కొట్టేస్తారని తెలుస్తుంది.

అల్లు అర్జున్ తో ఈ సినిమాలో చాలా సర్ ప్రైజులే ప్లాన్ చేశాడట సుకుమార్. టీజర్ లో చూపించింది శాంపిల్ మాత్రమే అని అసలు బొమ్మ వెండితెర మీద చూపిస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా కమెడియన్ కం హీరో సునీల్ పాత్ర కూడా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. సినిమాలో పుష్ప రాజ్ వెన్నంటే ఉండే పాత్రలో సునీల్ కనిపిస్తాడట. సునీల్ ను కూడా ఈ సినిమాలో కొత్తగా చూపిస్తున్నాడట సుకుమార్. సునీల్ ఈమధ్య విలన్ గా కూడా చేస్తున్నాడు. పుష్ప సినిమాలో కూడా నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది.

ఓ పక్క హీరోగా చేస్తూ కమెడియన్ గా కొనసాగుతూ ఇప్పుడు విలన్ గా కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తున్నాడు సునీల్. కెరియర్ మధ్యలో స్లో అవడం తో జాగ్రత్త పడ్డ సునీల్ మళ్లీ ట్రాక్ లోకి రావాలని చూస్తున్నాడు. సినిమా చిన్నదా పెద్దా అని చూడకుండా ఇదివరకు చేసినట్టుగా వరుస సినిమాలు చేస్తున్నాడు. పుష్ప సినిమాలో సునీల్ పాత్ర కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఉంటుందని చెబుతున్నారు. సుకుమార్ డైరక్షన్ లో సునీల్ చేస్తున్నాడు అంటే ఆ పాత్రకి తప్పకుండా స్పెషల్ క్రేజ్ వచ్చినట్టే లెక్క. సునీల్ కూడా పుష్ప మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడని తెలుస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: