అలాంటి ముగింపు ప్రభాస్ ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా..!

shami
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తర్వాత చేస్తున్న భారీ మూవీ రాధే శ్యామ్. ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బజెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. పిరియాడికల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా గురించి వచ్చే ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఇక లేటెస్ట్ గా సినిమా క్లైమాక్స్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. రాధే శ్యామ్ క్లైమాక్స్ సాడ్ ఎండింగ్ తో ఉంటుందట.

మరి ప్రభాస్ లాంటి హీరో సినిమాలో సాడ్ ఎండింగ్ అంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అని అనుకోవచ్చు. ఆడియెన్స్ యాక్సెప్ట్ చేసేలా ఈ ఎండింగ్ ఉంటుందని టాక్. జిల్ ఫేం రాధాకృష్ణ రాధే శ్యామ్ కోసం చాలా కష్టపడుతున్నాడు. సినిమా పై తన భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా చేస్తున్నాడు. ప్యూర్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో ఎంటర్టైన్ మెంట్ కూడా బాగా ఉంటుందని ఈమధ్యనే కమెడియన్ ప్రియదర్శి చెప్పాడు.

ప్రభా ఫ్యాన్స్ అంతా మరోసారి కాలర్ ఎగురవేసేలా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. తప్పకుండా రాధే శ్యాం అంచనాలకు మించి ఉండేలా చూస్తున్నారు. సినిమాలో పూజా హెగ్దే అందాలు కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని అంటున్నారు. ప్రభాస్, పూజా హెగ్దే ల జోడీ హైలెట్ గా వీరి ప్రేమకావ్యం ప్రతి ఆడియెన్ సూపర్ అనేలా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్, ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ మూడు సినిమాలతో మరోసారి తన స్టామినా నేషనల్ లెవల్ లో చూపించడానికి ఫిక్స్ అయ్యాడు ప్రభాస్. ఈ మూడు సినిమాలు ఒక దానికి మించి మరొకటి అనిపించేలా వస్తున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: