నాన్న గారే ఆదర్శం.."మా"కు సేవ చేయడమే లక్ష్యం : మంచు విష్ణు

MADDIBOINA AJAY KUMAR
ఈసారి మా ఎన్నికలు రసవత్తరంగా జరగనున్నాయి. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే నలుగురు అభ్యర్థులు ప్రకటించారు. వారిలో నటి హేమ, మంచు విష్ణు, జీవిత, ప్రకాష్ రాజ్ లు ఉన్నారు. ఇంకా ఎన్నికల తేదీ ప్రకటించక ముందే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న సభ్యులు మీటింగ్ లు నిర్వహించి విమర్శలు చేసుకుంటున్నారు. తమ ప్యానల్ లను ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికలను త్వరలో నిర్వహించాలని కోరుతున్నారు. ఇప్పటికే జీవిత మరియు ప్రకాష్ రాజ్ లు ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టగా తాజాగా హీరో మంచు విష్ణు "నా మా కుటుంబానికి" అంటూ లేఖను విడుదల చేశారు.

ఈ లేఖలో మంచు విష్ణు... "మా అధ్యక్ష పదవికి నేను నామినేషన్ వేస్తున్నా అని మా కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియజేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా
 కుటుంబంలో పుట్టిన నేను సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలను ప్రత్యక్షంగా చూశాను. నాకు మా కుటుంబ సభ్యుల భావాలు, బాధలు తెలుసు. నాకు నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిన తెలుగు పరిశ్రమకు మేము రుణపడి ఉన్నాము. మా నాన్న అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన సేవలు, వారి అనుభవాలు ఆయన నాయకత్వ లక్షణాలు నాకు మార్గదర్శకత్వం అయ్యాయి.

మా లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పని చేసినప్పుడు మా బిల్డింగ్ ఫండ్ కి నా కుటుంబం తరపున భవన నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం ఇస్తానని మాటిచ్చాను. బిల్డింగ్ నిర్మాణం ప్రారంభం అవ్వలేదు. ప్రెసిడెంట్ గా కొన్ని సలహాలు సూచనలు చేశాను వాటిని కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలు చేసాను. నాకు మా కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన ఉంది. మన ఇంటిని మనమే కట్టుకుందా ము. మా
 సభ్యులను ఎప్పుడూ ఆదుకుంటూ ఉంటాం.. అందుబాటులో ఉంటాం.. అధ్యక్షుడిగా నా సేవలను సంపూర్ణంగా అందించాలి అనుకుంటున్నాను. పెద్దల అనుభవాలు .. యువ రక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలిసి నడవాలని నా ప్రయత్నం.. మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని కోరుకుంటున్నాను" అంటూ విష్ణు లేఖలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: